రాష్ట్రీయం

వర్శిటీలో వివక్ష: కేజ్రీవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో వర్శిటీలో ప్రాంగణంలో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులను న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం పరామర్శించారు. రోహిత్ ఆత్మహత్య సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ రోహిత్ మెరిట్ ఆధారంగానే యూనివర్శిటీలో సీటు సంపాదించాడని, రిజర్వేషన్లతో కాదని గుర్తు చేశారు. యూనివర్శిటీలో చోటుచేసుకున్న సంఘటనలపై కేంద్రమంత్రి దత్తాత్రేయ ఎలాంటి విచారణ జరపకుండా విద్యార్థులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాశారని ఆయన ఆరోపించారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ అంశాన్ని దళితులకు, ఇతరులకు మధ్య చిచ్చురేపే విధంగా చిత్రీకరించారని విమర్శించారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాలతోనే హెచ్‌సియూకి కొత్త వైస్ చాన్సలర్ వచ్చారని తెలిపారు. ఏబివిపి వేధింపులతోనే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. వర్శిటీలో ఎబివిపి నాయకుడు సుశీల్ కుమార్‌పై అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ విద్యార్థులు దాడి చేయలేదని, సుశీల్ ఆపరేషన్‌కు, ఏఎస్‌ఎ దాడికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. యూనవర్శిటీలో విద్యార్థుల పట్ల వివక్ష కొనసాగుతోందని, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల మధ్య వివక్ష తగదన్నారు. దేశంలోనే పేరొందిన హెచ్‌సియూలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకులైన కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
చర్చ జరగాలి: డొక్కా
హైదరాబద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఇప్పటివరకు తొమ్మిదిమంది ఆత్మహత్యలు చేసుకుంటే వారిలో ఎక్కువ శాతం ఎస్సీలు, ఎస్టీలు, బిసిలే ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. వర్శిటీలో విద్యార్థులు ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడుతున్నారో యాజమాన్యం సమీక్షించుకోవాలన్నారు. వర్శిటీలో అన్ని భావజాలాలపై చర్చ జరగాలని ఆయన అన్నారు.