రాష్ట్రీయం

వీరుడా..వందనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/కర్నూలు, ఫిబ్రవరి 15: సియాచిన్ మంచుకొండల ప్రమాదంలో అమరుడైన వీర సైనికుడు ముస్తాఖ్ అహ్మద్ భౌతికకాయం సోమవారం అర్థరాత్రి ఆయన స్వగ్రామమైన కర్నూలు జిల్లా పార్నపల్లికి చేరుకుంది. అహ్మద్ భౌతికకాయానికి మంగళవారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. తొలుత వీర జవాన్ భౌతిక కాయం ప్రత్యేక విమానంలో సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంది. అహ్మద్ భౌతికకాయంపై పలువురు రాజకీయ నాయకులు, ఆర్మీ అధికారులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన స్వగ్రామమైన కర్నూలు జిల్లా నంద్యాల మండలం పార్నపల్లికి రోడ్డు మార్గాన భౌతిక కాయాన్ని తరలించారు. కాగా ముస్తాఖ్ అహ్మద్ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అందుకు ఏపి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కూడా ఏపి కేబినెట్ నిర్ణయించింది. మంగళవారం మధ్యాహ్నం పార్నపల్లిలో జరుగనున్న అహ్మద్ అంత్యక్రియల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి, ఆర్మీ అధికారులు పాల్గొంటారు.