రాష్ట్రీయం

విశాఖకు వివిఐపీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 21: తీర ప్రాంత భద్రతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో సమీక్షించనున్నారు. వచ్చే నెల నాలుగో తేదీ నుంచి ఏడవ తేదీ వరకూ విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఐదవ తేదీ సాయంత్రానికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మోదీ విశాఖకు చేరుకోనున్నారు. ఫ్లీట్ రివ్యూకు తీర ప్రాంత ముఖ్యమంత్రులు, హోంశాఖ మంత్రులు, గవర్నర్లను ఆహ్వానించాల్సిందిగా భారత నౌకాదళ అధికారులకు సమాచారం అందింది. తీర ప్రాంత ముఖ్యమంత్రులు, హోం మంత్రులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి, తీర భద్రతను ప్రధాని మోదీ సమీక్షించాలన్న ఆలోచనకు వచ్చారు. అయితే సమావేశ తేదీని, సమయాన్ని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన నౌకాదళాధికారులు, ముఖ్యమంత్రులు, హోంశాఖ మంత్రులు, గవర్నర్లు హాజరుకాబోతున్నారు.ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫ్లీట్ రివ్యూని పురస్కరించుకుని దేశ, విదేశాల నుంచి వచ్చే యుద్ధ నౌకలను రాష్టప్రతి సందర్శించనున్నారు. విశాఖ తీరానికి సమీపంలో యుద్ధ నౌకలు బారులు తీరి ఉంటాయి. రాష్టప్రతి ఐఎన్‌ఎస్ సుమిత్ర యుద్ధ నౌకపై ప్రయాణిస్తూ ఈ యుద్ధ నౌకలన్నింటినీ సందర్శిస్తారు. అనంతరం రాష్టప్రతి ప్రణబ్ ఇదే యుద్ధనౌక మీద నుంచి ఫ్లీట్ అధికారులను, జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
నిర్వహణలో ఉన్న నౌకల్లో బస
ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు సుమారు 1000 మంది నౌకాదళ అధికారులు దేశ విదేశాల నుంచి విశాఖకు వస్తున్నారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌తోపాటు వీరి సెక్రటేరియట్ సిబ్బందికి తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో ఉన్న నేవీ మెస్‌లో బస ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాల్లో వీరంతా నౌకాదళానికి ఐఎన్‌ఎస్ డేగా విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఫ్లీట్ రివ్యూ జరిగే బీచ్ రోడ్డుకు ప్రత్యేక హెలికాప్టర్లలో హాజరవుతారు. ఇందుకోసం ఫిషింగ్ హార్బర్‌కు సమీపంలో ఉన్న కోస్టల్ బ్యాటరీలో హెలిప్యాడ్‌ను పటిష్ఠ పరిచారు. వీరితోపాటు వివిధ దేశాల నుంచి వచ్చే నౌకాదళ ప్రధానాధికారులు, కేంద్ర మంత్రులు, కార్యదర్శులకు నగరంలోని నాలుగు, ఐదు నక్షత్రాల హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులకు ప్రభుత్వరంగ అతిథిగృహాలు, త్రీ స్టార్ హోటల్స్‌లో బస ఏర్పాటు చేశారు. ఇక, వివిధ దేశాల నుంచి వచ్చే రియర్ అడ్మిరల్, ఆ కింద స్థాయి నౌకాదళ అధికారులు, సెయిలర్లకు ప్రస్తుతం తూర్పు నౌకాదళ కేంద్రంలో నిర్వహణలో ఉన్న యుద్ధ నౌకల్లో బస ఏర్పాటు చేశారు. 700 మందికి ఇక్కడ బస ఏర్పాటు చేస్తున్నారు.
నగరానికి చేరుకున్న ఎస్‌పిజి
ప్రత్యేక భద్రతా విభాగం (ఎస్‌పిజి) ఎఐజి సుమిత్ నేతృత్వంలోని బలగాలు గురువారం నగరానికి చేరుకున్నాయి. వీరు బృందాలుగా విడిపోయి, ఒక బృందం భీమిలి సముద్ర తీరం నుంచి ఆర్‌కే బీచ్ వరకూ పర్యటించింది. మరో బృందం ఆర్‌కే బీచ్‌లో ఫ్లీట్ రివ్యూ ఏర్పాట్లను పరిశీలించింది. మరో బృందం ఐఎన్‌ఎస్ డేగాను పరిశీలించింది. మరో బృందం తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయాన్ని, ఐఎన్‌ఎస్ శాతవాహనను పరిశీలించింది.