రాష్ట్రీయం

కనె్వన్షన్ సెంటర్‌కు సింహాచలం భూమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15 : విశాఖపట్నంలో కనె్వన్షన్ సెంటర్ నిర్మించేందుకు సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనర్సింహ స్వామి దేవాలయానికి చెందిన 10 ఎకరాల భూమిని లీజుపై ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఏటా 96,80,000 రూపాయల అద్దె చెల్లించే ప్రాతిపదికపై ఎపిఐఐసి (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్)కి భూమిని అందచేసేందుకు వీలుగా దేవాదాయ కమిషనర్‌కు ప్రభుత్వం అధికారం కల్పించింది. విశాఖ జిల్లాలోని అడివివరం గ్రామంలో ఉన్న సర్వేనెంబర్ 12 కలిగిన భూమిని లీజ్‌పై ఇవ్వాలని నిర్ణయించారు. లీజుపై ఇచ్చే భూమికి ఎపిఐఐసి చెల్లించే అద్దె ప్రతి మూడు సంవత్సరాలకు ఒక పర్యాయం 10 శాతం పెంచాలని నిర్ణయించారు. ఎపిఐఐసికి సింహాచలం భూమిని కేటాయించాలని దేవాదాయ శాఖ కమిషనర్ 2015 సెప్టెంబర్ 21, అక్టోబర్ 13 తేదీలలో పంపించిన రెండు ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం లీజుపై భూమిని ఇచ్చేందుకు అంగీకరించింది. రెవెన్యూ (దేవాదాయ) ముఖ్యకార్యదర్శి జెఎస్‌వి ప్రసాద్ పేరుతో ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.