వాసిలి వాకిలి

ఆరిజన్ సెకండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆరిజన్ ఒన్’ నుండి ఉనికిలోకి వచ్చిన మనం కానీ, ఏ ఇతర అంశాలు కానీ రూపంలోను, లక్షణాలలోను, వర్తనంలోను, వికసనంలోను మార్పులకు లోనవుతూనే ఉన్నాయి. ఇలా మార్పులు చెందుతున్న మనం కానీ, మనతోపాటు సృష్టిలో భాగస్వాములైన ఏ ఇతర అంశాలు కానీ ‘ఆరిజన్ సెకండ్’ క్రింద లెక్క. అంటే మార్పు చెందుతున్న సృష్టి అంశాలు మార్పు చెందకుండా ‘ఆరిజన్ ఒన్’లా స్థిరంగా ఉండగలగాలి. అధిభౌతికంగా సాధ్యమైన అమరత్వం భౌతికంగాను సాధ్యం కావటానికే మాస్టర్ సి.వి.వి. భృక్తరహిత తారక రాజయోగ మార్గాన్ని సాధకులకు అందించారు.
‘ఆరిజన్ సెకండ్’ అయిన మనం ‘ఆరిజన్ ఒన్’గా పరిణమించటమే మాస్టర్ యోగసాధనా రహస్యం. మన రూపానికి శాశ్వతత్వం కలగాలి.. అంటే ఎటువంటి మార్పులకు తావీయని శరీర నిర్మాణం జరగాలి.. అలా జరగాలంటే ఖగోళ ప్రభావాలు లేని మానవ మనుగడ సాధ్యం కావాలి. అంటే గ్రహ ప్రభావాల నుండి, నక్షత్ర ప్రభావాల నుండి మానవ జన్మను తప్పించాలి.. మానవ జననం ఒక ‘స్వయంభువు’లా సాగాలి.
ప్లానెటరీ లీడింగ్
‘ఆరిజన్ సెకండ్’ అయిన మనం ‘ఆరిజన్ ఒన్’గా పరిణమించటానికి ‘తర్టీన్ ప్లానెటరీ ఫోర్సెస్’ సాధనను ప్రతి శుక్రవారం చేయవలసిందిగా మాస్టర్ సి.వి.వి. నిర్దేశించారు. ఈ కోర్స్‌తోపాటు ప్రాక్టీస్‌కు సెవన్ ప్లానెటరీ కీస్, సెవన్ ప్లానెటరీ లీడ్స్‌ను కూడా సాధన చేయమని చెప్పారు. ఈ ప్రాక్టీస్ తర్వాత నక్షత్రా రెగ్యులేషన్స్, లగ్నా రెగ్యులేషన్స్ అంటూ రెండు కోర్స్‌లను ప్రాక్టీస్ కిచ్చారు. ఈ కోర్సుల సాధన వల్ల కేవలం గ్రహాలు మాత్రమే మనపై ప్రభావం చూపటం కాక మనం సైతం వాటిపై ప్రభావం చూపగలం. అయితే ఈ కోర్స్‌ల ప్రాక్టీస్ వల్ల గ్రహాల ప్రభావాల కంటే వాటిపై మన ప్రభావం ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది. ఈ యోగ సాధనా ప్రక్రియనే ‘ప్లానెటరీ లీడింగ్’ అంటాం.
ఎప్పుడైతే గ్రహశక్తి కంటే మన శక్తి అధికం అవుతుందో అప్పుడు గ్రహాల ప్రభావం మనపై ఉండదు. ఫలితంగా మనలో శాశ్వతత్వం నెలకొంటుంది. మనం ‘ఆరిజన్ సెకండ్’గా సాధించే శాశ్వతత్వం ‘ఆరిజన్ ఒన్’ శాశ్వతత్వానికి ప్రతిబింబమే. ఇలా ‘్ఫజికల్ ఇమ్మోర్టాలిటీ’ కోసం చేసే యోగ సాధనలో మనం మాస్టర్ సి.వి.వి. ఇచ్చిన కోర్స్‌లను శబ్దరూపంలో గ్రహ మండలాలకు చేరుస్తుంటే గ్రహాలు తమ ప్రతిస్పందనలను తరంగాల రూపంలో మనకు చేరవేస్తున్నాయి. వీటినే ‘యోగిక్ వైబ్రేషన్స్’ అంటాం.
ఈ వైబ్రేషన్స్‌లన్నీ సాధనలో సమాధి స్థితిలో కాక కాన్షియస్ స్టేట్‌లో సాధ్యం కావటమే మాస్టర్ యోగం ప్రత్యేకత. మనం చెప్పుకున్న ప్లానెటరీ ఫోర్సెస్ కంటే ఫైనస్ట్ ఫోర్స్ ‘ప్రాణిక్ ఫోర్స్’. ఈ ప్రాణిక్ ఫోర్స్‌తో మెర్రీలైఫ్‌ను సాధ్యం చేసుకుంటూ ‘ఇమ్మోర్టాలిటీ ఆఫ్ ది ఫిజికల్ సిస్టమ్’ సాధించటమే మాస్టర్ యోగ సాధనా లక్ష్యం. ఎటువంటి రోగ బారిన పడకుండా, కృశించకుండా మనం వజ్రకాయులం కావటానికి, వయసుతోపాటు రూపంలో మార్పు రాకుండా ఉండటానికి చేసే సాధనే మాస్టర్ యోగం.

-విశ్వర్షి 93939 33946