రాష్ట్రీయం

వననస్థలిపురం ఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సస్పెండ్ చేసినందుకు మనస్తాపం కమిషనరేట్ ఎదుట ఘటన
హైదరాబాద్, నవంబర్ 28: అవినీతి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడనే అభియోగాలపై సస్పెండ్ అయిన వనస్థలిపురం ఎస్‌ఐ సైదులు శనివారం సైబరాబాద్ కమిషనరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసు స్టేషన్‌కు వచ్చేవారి పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు కేసుల నమోదులో అవినీతికి పాల్పడుతున్నాడని, వనస్థలిపురం పరిసర ప్రాంతాల్లోని వ్యాపారులను బెదిరిస్తూ అక్రమ వసూళ్లు చేస్తున్నాడంటూ పలు ఫిర్యాదులు వచ్చాయి. పోలీసు ఉన్నతాధికారుల దర్యాప్తులో ఆరోపణలు నిజమేనని తేల్చుకున్న తరవాత ఎస్‌ఐ సైదులును శుక్రవారం సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ సస్పండ్ చేశారు. దీంతో మనస్థాపానికి గురైన ఎస్‌ఐ శనివారం సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగాడు. నురుగులు కక్కుతున్న ఎస్‌ఐని వెంటనే గచ్చిబౌలిలోని హిమగిరి ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయమేమీలేదని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.