తెలంగాణ

‘అన్ని వర్శిటీల్లో అసంతృప్తే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థుల్లో అసంతృప్తి భగ్గుమంటోందని జెఎన్‌యు విద్యార్థి బృందం ఆరోపించింది. జెఎన్‌యుఎస్‌యు ఉపాధ్యక్షురాలు షెహ్లా రషీద్, మాజీ అధ్యక్షుడు అక్బర్ చౌదరి, ఎఐఎస్‌ఎ కార్యకర్త మోహిత్ ఆదివారం ఇక్కడ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఢిల్లీలోని జెఎన్‌యులో అసలు ఏం జరిగిందో విద్యార్థులకు వివరించేందుకు హైదరాబాద్ వచ్చామన్నారు. యూనివర్శిటీల్లో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను వివరించాలని కొన్ని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయని వారు చెప్పారు. జెఎన్‌యు, హెచ్‌సియు విద్యార్థులపై తప్పుడు కేసులను ఎత్తివేసే వరకూ పోరాడుతామన్నారు. రాజకీయ జోక్యానికే రోహిత్ వేముల బలయ్యాడని, అతడిని ‘బచ్చా’ అంటూ సంబోధించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్థి నాయకులకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.