వాసిలి వాకిలి

నేను.. సమాధి స్పృహను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను
మెలకువను -
కలలోను.. ఇలలోనూ!
దృశ్యంలోను.. అదృశ్యంలోనూ!
చీకటిలోను.. వెలుతురులోనూ!
ఉచ్ఛ్వాసలోను.. నిశ్వాసలోనూ!
నేను
నిద్రలోని మెలకువను -
సుడులు తిరుగుతు, తిరుగుతూ
ఉదయానికి జ్ఞానప్రసూన మవుతాను
ధ్యానగర్భ నవుతూ
అక్షరంగా ప్రసవిస్తాను
అ-క్షరంగా!
నేను-
అచేతనా చేతనను
- యోగ నిద్రను.
సమాధి స్పృహను
-తురీయాన్ని.
* * *
నేను
‘రిలాక్స్.. రిలాక్స్... రిలాక్స్’ అని మనసుకు సజెషన్ ఇచ్చినంత మాత్రాన రిలాక్స్ కాలేను.
నాలో ఆందోళన తగ్గాలి... ఆతృత తగ్గాలి. సింపుల్‌గా చెప్పుకోవాలంటే ‘తొందరతనం’ తగ్గాలి.
తొందరపాటు వల్ల టెన్షన్... ఇంకా చెప్పుకోవాలంటే నరాల బలహీనత - స్ట్రెస్ - ఒత్తిడి.
నలుగురు కూర్చోవలసిన కార్లో నలుగురే కూర్చుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సాగుతుంది. ఎంత దూరమైనా కూల్‌గా ప్రయాణించవచ్చు. నలుగురు బదులు ఐదుగురు కలిసి ప్రయాణించినా కాస్తంతయినా ఇబ్బందే.. కదలటానికి అవకాశం ఉండదు. మరొకరు చేరితే తొడతొక్కిడే.. కాళ్లు చేతులు పట్టుకుపోతాయి. కోపం తన్నుకు వస్తుంది. అశక్తత పెల్లుబుకుతుంటుంది.
ఈ స్థితిలో ‘రిలాక్స్’ అని మనసు సర్ది చెప్పుకోగలమా? మనసుకు ‘సజెషన్’ ఇచ్చినా దేహం ఇబ్బంది పడుతోంది కదా! ఎన్ని గంటలని ముడుచుకు కూర్చోగలం.. ఎంతకాలమని సర్దుకుపోగలం. ఎనిమిది గంటల ప్రయాణంలో లేని అలసట సర్దుబాటుతనంలో గంటలోనే కలుగుతుంది. ఇదంతా ఒత్తిడే! కాబట్టి మనసును రిలాక్స్ అని అన్నంత మాత్రాన ఒరిగేదేం లేదు. మైండ్ కూల్‌గా ఉండాలంటే చుట్టుపక్కల ‘ఇరుకుతనం’, మనలో ‘తొందరతనం’ కాపురం చేయకూడదు. అందుకే మనసు, దేహం - రెండూ రిలాక్స్ కావలసిందే.
* * *
రిలాక్స్డ్‌గా, కూల్‌గా ఉండగలగటం వల్ల, ఆలోచనలు యమస్పీడ్‌గా తోసకు రాకపోవటం వల్ల మనలో సృజనశీలత పెరుగుతుంది. కాల్పనిక సాహిత్యకారులు, కళాకారుల ప్రతిభకు గీటురాయి మనసు తొందర పడకపోవటమే! ఒత్తిడికి గురి కాకపోవటమే! బయటి వారు డెడ్‌లైన్ పెట్టుకుంటారే కానీ కళాకారులెవరూ డెడ్‌లైన్ అంటూ తొందరపడిపోరు, బిగుసుకుపోరు. జీవిత సమస్యనైనా, సామాజిక సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకోగల సత్తా వీరికి ఉంటుంది. నిజానికి, అసలైన వ్యాపార రహస్యం తెలిసినవారు సైతం కూల్‌గానే ఉంటుంటారు. కారణం, వీరిలో ‘అల్ఫా’ బ్రెయిన్‌వేవ్స్ పసిగా ఉండటమే!
సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నపుడు అల్ఫా వేవ్స్ వల్ల పరిష్కారం సులభమూ, సానుకూలమూ అవుతుంది. రచనా సమయంలో రచయిత ఒక మంచి వాక్యం రాయగలిగితే రిలాక్స్ కావటం అల్ఫా బ్రెయిన్ వేవ్స్ వల్లనే. ఇలా ఏ కళాకారుడైనా తన పెర్ఫామెన్స్‌తో రిలాక్స్ అవుతున్నాడంటే అది ‘అల్ఫా’ గొప్పతనమే.
మొత్తానికి, అల్ఫా స్టేట్‌లో మనసు పరుగులు పెట్టదు. తుళ్లిపడదు అన్నది స్పష్టం. తన ‘సృజన’కు తానే ‘ఔరా’ అనుకుంటుంది. అల్ఫా బ్రెయిన్ వేవ్స్ వల్ల మేథా సంపన్నులం అనిపించుకోవటం, జ్ఞాని అన్న ముద్ర పడటం జరుగుతుంది. ఇది మైండ్‌ను మైండ్ చేయటం వల్ల సిద్ధించే ‘ఆరా’.
యోగ సాధన తొలిదశలో అల్ఫా వేవ్స్, మలిదశలో తీటా వేవ్స్ మనలను ప్రభావపరిచేది ఇలానే. ఇక డెల్టావేవ్స్ యోగ పరిణతికి సూచికలు.
Every Higher conscious master imparts wisdom through the alignment of being in states of turiya through Prayer, contemplation, meditation and inspiration.

యోగంలో ‘అమాత్ర’ స్థితి అంటూ ఒకటుంధి. అది అతీత మానస స్థితి. మనస్సు ప్రమేయం ఏ కోశానా ఉండదు. ‘లోచన’ ఉంటుందే తప్ప ఆలోచన ఉండదు. ‘లోచన’ది అనుభూతి తప్ప ఆలోచనలా స్మృతి కాదు. స్మృతి, జ్ఞాపకం మనస్సు పరిధిలోది. లోచన మనస్సును దాటినటువంటిది కాబట్టి అనుభూతి ‘నా స్వంతం..’ ..మాటలు, అక్షరాలు గుదిగుచ్చలేని స్థితి.
ప్రకృతిలోని రంగులను కాన్వాస్‌పై ఎంతలా కలబోసినా అబ్బో అనిపిస్తాయే తప్ప ప్రకృతిని యథాతథంగా, సహజంగా దింపలేవు. ప్రకృతి రంగుల్లోని ‘స్పిరిట్’ కాన్వాస్‌పై కనిపించదు. ‘అమాత్ర’ అనుభూతి కూడా అటువంటిదే! సృజన కాదు కదా అను సృజనకు కూడా అందని అనుభూతి అది. అందుకే, ధ్యాన స్థితికి పరాకాష్ఠగా మనం ‘తురీయ’తను చెప్పుకుంటాం. తురీయంలోను ఉచ్ఛస్థితి ఇది.
అసలు, అమాత్ర స్థితి అంటేనే అద్వైతం, అభేదం, అనంతం. మనం చాల సహజంగా చెప్పుకునే ఆత్మదర్శనం నిజానికి ఆత్మ ‘దర్శనం’ కాదు. ‘అమాత్ర’లోనే ఆత్మదర్శనమవుతుంది. ఆత్మ - పరమాత్మ అన్న వింగడింపు లేని ‘ఆత్మ’ దర్శన స్థితి ఇది. అద్వైత, అభేద, అనంత ఆత్మ దర్శనం ఇది.
చివరికి - జ్ఞానం, జ్ఞాని సైతం వేరువేరు కాదు... ఆత్మ, ఆత్మతత్త్వం వేరువేరు కాదు... ఆత్మ, పరమాత్మ వేరువేరు కాదు... భౌతికం, అభౌతికం, వేరువేరు కాదు. అంటే, అమాత్ర స్థితి అనేది ‘జీవన్ముక్త’ స్థితి. జీవన్ముక్త స్థితి అనేది ఏకమే! అసలు, తురీయం అంటేనే శూన్యం. అమాత్ర అన్నది - నిల్, గాన్, లెస్, ఎంప్టీ, వాక్యూమ్, నథింగ్, నాట్, నో, నాట్ (శ్ఘఖదఆ) నన్, వాయ్‌ఢ్, వేకెంట్, నిహిల్ - అనే పదమూడు శూన్యతల సమాధి స్పృహ. తురీయతలో శూన్యం అంటే ఏమీ లేనిది.. లేనితనంలో సమాధిని సాధించటం. ఈ శూన్య సమాధి స్థితికి ఆవల ‘ఇంకా’ ఉంది. ఆ ఉన్నది పదమూడు దశల ఆరోహణా శూన్యత. ఈ పదమూడు శూన్యతలలో సమాధి కాగలిగితే ఇక దాటవలసింది, చొచ్చుకు పోవలసింది, లోతులకు చేరవలసింది మరేదీ లేదు. ఇలా అమాత్ర అన్నది శూన్యతను బోర్ చేయటం. అంటే, ‘బోరింగ్ ది నథింగ్‌నెస్.’
మానసం, మానసాతీతం అన్నట్లు తురీయం, తురీయాతీతం అనీ అంటుంటాం. మనసుకు ఇంద్రియాలతో లావాదేవీలుంటాయి. కాబట్టి ఇంద్రియాతీతం అయ్యే ప్రక్రియలో మానసాతీతం అవుతాం. మానసాతీతం అంటేనే తురీయం. తురీయంలో అమాత్రది అన్నింటికంటే పై స్థాయే తప్ప అతీతం స్థితి కాదు. కాబట్టి తురీయాతీతం అని ప్రత్యేకంగా చెప్పుకోకపోయినా అమాత్రను తత్సమానంగానే పరిగణించవచ్చు.
* * *
యోగం ‘యోగి’ కావటానికే తప్ప యోగిలా’ కావటానికి కాదు... అంటే, ‘నేను’ యోగం కావాలి! ఇలా అద్వైతం, అభేదం, అనంతం, ఏకం కావటమే ‘యోగి’గా పరిణమించటం. విడగొట్టటానికి అవకాశం లేనివాడు ‘యోగి.’ ఇలా అమాత్రకు నిన్న - నేడు -రేపు - నువ్వు - నేను - ప్రకృతి - పురుష అంటూ ఉండవు.
"Mind Space' transforms itself into "Mindless Space' -ఇదీ గిక స్థితి. ఈ ధ్యానస్థితి గిక చైతన్య స్థితి. గిక చైతన్యవంతా ఖగోళ చైతన్యం. ఇదే చిదాకాశ చైతన్యం.
తురీయ, అమాత్రలకు భూమిక సమాధ్యవస్థ. నిజానికి, చేతనావస్థ నుండి అచేతనావస్థలోకి జారుకోవటం సమాధి కాదు. అలాగే అచేతన నుండి చేతనలోకి రావటమూ సమాధి కాదు. అంటే, సమాధి నుండి బయటపడటమూ, సమాధిలోకి చేరటమూ అనే రెండు స్థితులు లేనే లేవు. ఖగోళంతో సంయోగించగలిగితే జాగృత్, స్వప్న, స్వప్నాతీత, తురీయ స్థితులన్నింటా సమాధి స్థితిలో నిలదొక్కుకోగలం.
దేహానికి చెందిన భూతాకాశ తత్వమూ, మనసుకు చెందిన చిత్తాకాశమూ కాని అంటే రెంటికీ అతీతంగా చిదాకాశం తురీయం అవుతుంది. తురీయ, అమాత్రల సంయోగం నక్షత్ర, గ్రహ, రుషి మండలాలతో అన్న మాట. అందుకే - తురీయ, అమాత్రల చిదాకాశం ‘ఆత్మ’ స్వంతం. అంటే, తురీయ అమాత్రలు నిర్మలం, నిర్గుణం, నిరంజనం, నిత్యం, శుద్ధం, బుద్ధం, ముక్తం.
గికంగా అవాత్ర, తురీయతలు మనకు అందించేది స్థితప్రజ్ఞత్వాన్ని. అహం బ్రహ్మస్మి, తత్వమసి అన్న స్థితులను అనుభూతించేది, ఆ స్థితులలో మమేకమయ్యేది తురీయతలోనే!
ఇక, అమాత్ర స్థితిలో నిన్న నేడు రేపులు అభేదాలు. గతం వర్తమానం భవిష్యత్తులను ఎటువంటి విభేదం లేకుండా అనుభూతించటం సాధ్యమవుతుంది. భూత భవిష్య వర్తమాన సంఘటనలన్నీ సక్రమమైనవే. వాస్తవాలే! అంటే, దేన్నీ ‘రెండు’గా చూడటం జరగదు. నిన్న నేడు రేపులు కాలంలోనే పాయలే!
జీవితంలోని బంధ, బంధరాహిత్యం కూడా రెండు పార్శ్వాలే. అంటే, మనస్సు సృష్టించేవే బంధ స్థితి, బంధ రహిత స్థితి అనేవి. మానసాతీతమైన తురీయంలో బంధమైనా, బంధ రహితమైనా ఒక్కటే!
తురీయంలో పొదువుకునే ఆత్మతత్వం ఇదే!
* * *
Tobe a successful meditator is to follow the steps many times with awareness, commitment and common sense.
జీవితమే యోగం, యోగమే జీవితం కావటానికి అనేక మార్గాలుంటాయి, అనేక మెట్లుంటాయి. అన్ని మార్గాలలో అడుగులు పడటం అంటే రోడ్ మాప్ ‘ఎరుక’ మాత్రమే. ఏ మార్గం ఎక్కడ కలుస్తుంది, ఎక్కడికి చేరుస్తుందో స్పష్టంగా తెలియాలంటే పలుమార్లు ప్రయాణించవలసిందే.
ఒక గురువు పది మార్గాలను యోగ మార్గంలో ఎరుక పరిస్తే, ఒకటికి పదిమార్లు ఆ మార్గాల సాధన కొనసాగవలసిందే. అంతేకానీ, ఒకసారి తిరుగాడినంత మాత్రాన యోగి కాలేం.. మార్గదర్శి కాలేం.
సో, యోగం అంటే సుప్రీం కాన్షియస్‌నెస్.
యోగం అంటే ఐ కాన్షియస్‌నెస్!!

-విశ్వర్షి 93939 33946