Others

కరీబియన్ కనికట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాలీవుడ్ యాక్షన్ సినిమా అనగానే పూనకం వచ్చేసే ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్లకోసమే అన్నట్టు -హాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు సైతం హిట్టయిన చిత్రానికి సీక్వెల్స్ పేరిట ‘పరంపర’ను సంధించటం అలవాటు చేసుకున్నాయి. వరుసపెట్టి వచ్చే సిరీస్‌లో ఏ ఒక్కటీ విఫలయం కాకుండా ‘ఓహ్’ అనిపించుకుంటున్న చిత్రాల్లో ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ సిరీస్‌ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సముద్రపు దొంగల సాహసాలను గగుర్పొడిచేలా దట్టించి హాలీవుడ్‌లో దుమారం రేపుతోన్న సిరీస్‌గా దీనికి ప్రత్యేకస్థానం ఉంది. ‘... కరీబియన్’ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా పర్మినెంట్ అభిమానులూ ఉన్నారు. జానీ డిప్ హీరోయిజంపై నమ్మకంతో ఇప్పటి వరకూ వచ్చిన సిరీస్‌లోని నాలుగు చిత్రాలూ హాలీవుడ్‌లో కలెక్షన్ల రికార్డులే సృష్టించాయి. బిలియన్ డాలర్ల వసూళ్ల మార్క్ అందుకున్న ఏడు హాలీవుడ్ చిత్రాల్లో రెండు ‘...కరీబియన్’ సిరీస్‌వే కావడం గమనార్హం. తాజాగా ‘..కరీబియన్’ సిరీస్‌లో ఐదో చిత్రంగా వచ్చిందే ‘డెడ్‌మెన్ టెల్ నో టేల్స్’.
కెప్టెన్ జాక్ స్పారోగా దుమ్ములేపే నటన ప్రదర్శించాడని జరిగిన ప్రచారానికి జానీ డెప్ ఎంత వరకూ న్యాయం చేశాడో చూద్దాం.
**
డెవిల్స్ ట్రయాంగిల్ నుంచి కెప్టెన్ సాలజర్ (జేవియర్ బెర్డెమ్)తోపాటు అతడి ముఠా ఆత్మలు తప్పించుకోవడం నుంచి సినిమా మొదలవుతుంది. ప్రతీకారంతో రగిలిపోతున్న సాలజర్ ఆత్మ, అతని ముఠా ఆత్మలు.. కెప్టెన్ జాక్ స్పారో (జానీ డెప్) బృందంలోని ప్రతి ఒక్కరినీ అంతమొందించాలని పగపడతాయి. వీటినుంచి తప్పించుకోవడానికి కెప్టెన్ జాక్ స్పారోకి ఒకేఒక మార్గం ఉంటుంది. మొత్తం సముద్రాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోగల అద్భుత శక్తులున్న ట్రిడెంట్ ఆఫ్ ప్రొసెడాన్ ఆయుధాన్ని చేజిక్కించుకోవాల్సి వస్తుంది. అనితర సాధ్యమైన ఆ సాహసాన్ని కెప్టెన్ జాక్ స్పారో ఎలా చేశాడు? చివరకు సాధించాడా లేదా? ఆ ప్రక్రియలో అతనికి ఎదురైన ఉపద్రవాలు ఏమిటి? అన్నదే మిగతా సినిమా.
‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ సిరీస్ నుంచి సినిమా వస్తుందని ప్రకటిస్తేనే.. అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతాయి. ఆ అంచనాలు ఏమాత్రం చెక్కుచెదరకుండా వాల్ట్ డిస్నీ స్టూడియోస్ భారీ నిర్మాణ విలువలతోనే ఈ సినిమానూ తెరకెక్కించింది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకూ వచ్చిన చిత్రాల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా సన్నివేశాల్లో సాసహాల రుచిని చూపించింది. యాక్షన్ పార్ట్‌ను కొద్దిగా తగ్గించినా, బిగుతైన సన్నివేశాలతో కథపై ఆసక్తిని పెంచడంలో చిత్ర బృందం విజయం సాధించింది. గత చిత్రాల్లో అతిగా కనిపించే కత్తియుద్ధాలు.. భారీ ఓడలమీద పోరాటాలు ‘డెడ్‌మేన్..’ చిత్రంలో పెద్దగా కనిపించవు. అయినా అభిమానులకు నిరాశ కలగకుండా దర్శక బృందం సన్నివేశాల్లో బిగింపు పెంచింది. ఆ సన్నివేశాలకు ప్రాణం పోయడంలో సినిమాటోగ్రఫీ నాయకుడు పాల్ కామెరూన్ పనితనం కనిపిస్తుంది. కెమెరా పనితనంలో ఆత్మను ఆవిష్కరింపచేసి అద్భుతాన్ని కళ్లకుకట్టాడు. కరీబియన్ ప్రాంతాలు, సముద్రంలోని సన్నివేశాలను గొప్పగా చిత్రీకరించటంతో, సీట్లలోంచి కదలబుద్ధి కాదు. క్లైమాక్స్ సన్నివేశాలను ప్రత్యేకంగా చెప్పుకునేకంటే చూసి ఆనందించాలి.
ఇక నటనాపరంగా చూస్తే ఇంత భారీ చిత్రాన్నీ ఇద్దరు నటులు తమ భుజాలపై మోసేశారు. ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ సిరీస్‌కు ప్రాణంగా నిలుస్తున్న కెప్టెన్ జాక్ స్పారో పాత్రలో జానీ డెప్ నటన అమోఘం. ఈ చిత్రంలోనూ వైవిధ్యమైన నటనతో కెప్టెన్ జాక్ స్పారో పాత్రతో హవా కొనసాగించాడు. ప్రతీకార వాంఛతో రగిలిపోయే కెప్టెన్ సాలజర్ పాత్రలో జేవియర్ బెర్డెమ్ ఒదిగిపోయాడు. ఇద్దరూ ఒకరికొకరు పోటీపడి సినిమాను నడిపించేశారు. జెప్రీ రష్, బ్రెంటన్ తదితరులు తమతమ పాత్రల పరిధిమేరకు మెప్పించారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ‘కరీబియన్..’ మళ్లీ కనికట్టు చేసింది.

-ప్రవవి