Others
తెలుగందం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 22 January 2016
మొదట్లో కొద్దోగొప్పో అవకాశాలను మిస్ చేసుకున్నా ఇప్పుడు మాత్రం వరుసబెట్టి చిత్రాలను పట్టేస్తోంది అందాల నాయిక అంజలి. వెంకటేష్‌కు జోడీగా నటించాక పెద్ద హీరోల సరసన ఆమె నప్పడంతో అలాంటి పాత్రలు ఆమెనే వెదుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా బాలకృష్ణ సరసన నటించింది. త్వరలో బాలయ్య వందో చిత్రంగా ఆదిత్య-999 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా అంజలినే మళ్లీ ఎంపికైంది. ఈ చిత్రంలో కథానాయిక తెలుగు అందాలతో మిసమిసలాడాలి కనుక ఆమెనే ఎంపిక చేశారని తెలుస్తోంది. సో రికార్డులకెక్కనున్న బాలయ్య వందో చిత్రంలో కథానాయిక అంజలీనే!