Others

ఎందుకిలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఐస్‌క్రీమ్’ సినిమాలో కథానాయికగా తెలుగమ్మాయి తేజస్వీ గుర్తుంది కదా? ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మాయికి రామ్‌గోపాల్‌వర్మ ఏకంగా హీరోయిన్ అవకాశం ఇచ్చాడు. ‘ఐస్‌క్రీమ్’ చిత్రంతో వర్మకు ఏదో ఒక గుర్తింపు వచ్చినా తేజస్వికి మాత్రం ఎలాంటి గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ‘జతకలిసే..’ లాంటి రెండు మూడు చిత్రాల్లో కథానాయికగా నటించింది. ఆ తర్వాత సహ నటిగా చాలా పాత్రల్లో నటించింది. కానీ ‘ఐస్‌క్రీమ్’ చిత్రంలో నటించాక ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయని, టాలీవుడ్‌లో వినిపిస్తున్న సమాచారం. తాజాగా మొన్న విడుదలైన ‘కృష్ణాష్టమి’లో కేవలం పీటలమీద పెళ్లికూతురుగా ఒక్క డైలాగు కూడా లేని పాత్రలో నటించింది. ఇది చూసిన టాలీవుడ్ ముక్కుమీద వేలేసుకుంటోంది. మంచి ప్రతిభవున్న నటులకు సరైన పాత్రలు దొరకడం లేదని టాలీవుడ్‌లో అందరూ అనేమాట మరోసారి
వినబడింది.!