Others

రాకేష్ శర్మగా షారూఖ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా మామూలుగా లేదు. ఇప్పటికే పలు బయోపిక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించి అటు కమర్షియల్‌గా కూడా సత్తా చాటుకున్నాయి. ప్రస్తుతం బయోపిక్ చిత్రాల్లో నటించేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ కూడా ఓ బయోపిక్‌లో నటించేందుకు రెడీ అయ్యారట. ప్రస్తుతం జీరో షూటింగ్‌లో వున్న ఆయన ఈ సినిమా తరువాత బయోపిక్ చేస్తారని తెలిసింది. ఇంతకీ ఆ బయోపిక్ ఎవరిదో తెలుసా? ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని, రాకేష్ శర్మకు సంబంధించిన అన్ని విషయాలు కూలంకషంగా పరిశీలించి స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ఈ పాత్ర కోసం షారుక్ కూడా సిద్ధమవుతున్నారు. సెల్యూట్ అనే పేరు పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నదట.

*