రాష్ట్రీయం

మార్చికల్లా సింగరేణి విద్యుత్ వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చివరి దశకు జైపూర్ ప్లాంట్ నిర్మాణ పనులు
12 మెగావాట్లతో వేసవి కరెంట్ కోతలకు చెక్

ఆదిలాబాద్, నవంబర్ 30: జిల్లా జైపూర్‌లో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులు చివరిదశకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ సరఫరా ఇబ్బందులను అదిగమించి, కరెంట్ కోతలను పూర్తిగా నివారించేందుకు ప్రభుత్వం సింగరేణి విద్యుత్ ప్రాజెక్టుపై పూర్తిగా దృష్టిసారించింది. వేసవికి ముందే సింగరేణి విద్యుత్‌ను పూర్తిస్థాయిలో సరఫరా చేసి నిరంతరాయంగా సరఫరా కొనసాగించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలోనే సింగరేణి సిఎండిగా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ డైరెక్టర్లతో కలిసి పక్షంరోజులకొక్కసారి జైపూర్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులపై సమీక్షిస్తూ పనులను వేగవంతం చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం కూడా గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేసి రెండు యూనిట్ల ద్వారా 1200 మెగావాట్లను మార్చి నెలఖరులోగా ఉత్పత్తి చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. జనవరి నెలలో ప్రయోగాత్మకంగా జైపూర్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి, తర్వాత రెండు నెలల వ్యవధిలో వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభించేలా పనులు వడి వడిగా కొనసాగిస్తున్నారు. అయితే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభానికి మరో రెండు నెలల గడవు ఉండడంతో సింగరేణి సంస్థ విద్యుత్ సరఫరా, విక్రయాలపై సిపిఏ ప్రక్రియపై దృష్టిసారిస్తుంది. జైపూర్‌లో 2010లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య విద్యుత్ పవర్ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. మూడేళ్లు నత్తనడకన పనులు సాగగా తెలంగాణ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఉత్పత్తిపైనే దృష్టిసారించి జైపూర్‌లో ఒక్కోటి 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో రెండు యూ నిట్ల నిర్మాణ పనులు చేపట్టారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరు నెలల కిందట జైపూర్ ప్లాంట్‌ను సందర్శించి పనులు ముమ్మరం చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు.
రెండు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ఇప్పటి వరకు 7573 కోట్లు ఖర్చుచేయగా ఒక్కో మెగావాట్‌కు 6.3కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ఏటా 8900 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేయాలని సింగరేణి యాజమాన్యం లక్ష్యంగా నిర్ధేశించుకుంది. జైపూర్‌లో వచ్చే జనవరిలోనే ప్రయోగాత్మకంగా విద్యుత్ సామార్థ్యాన్ని పరీక్షించేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే 2200 ఎకరాల భూసేకరణ పూర్తికాగా, పవర్‌ప్లాంట్‌లో బాయిల్‌టర్బన్ జనరేషన్ (బిటిజి) పనులు 99శాతం పూర్తయ్యాయి. బాయిలర్ నుండి విద్యుత్ ఉత్పత్తి సజావుగా సాగేలా సాంకేతిక పరమైన ప్రయోగాలు సాగిస్తున్నారు. అయితే బ్యాలెన్స్ ప్లాంట్‌వర్క్ (బివోపి) పనులు మాత్రం నత్తనడకన సాగడం విమర్శలకు తావిస్తుంది. ఈ పనులపైనే సి ఎండి, డైరెక్టర్లు పూర్తిగా దృష్టిసారించి, పనులు వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మంచిర్యాల నుండి జైపూర్ వరకు బొగ్గు సరఫరా కోసం రైల్వేమార్గం ఏర్పాటు చేస్తుండగా, జైపూర్ నుండి మంచిర్యాల వరకు ప్రత్యేకంగా రోడ్డుమార్గం ఏర్పాటు చేశారు. ఇందుకు 19కోట్లు కూడా ఖర్చుచేశారు. మార్చి నెలాఖరు వరకు 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సరఫరా చేసి, ఆ తర్వాత జెన్కోకు నిర్వహణ బాధ్యతలను అప్పగించనున్నారు. అంతేగాక తెలంగాణలో పూర్తిగా విద్యుత్ అవంతరాలను అదిగమించి, నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేసే లక్ష్యంతో ప్రభుత్వం మరో 600 మెగావాట్ల ప్రాజెక్టుకు ఇక్కడే పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. 2018లోగా 600మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పూర్తిచేసి, కరెంట్ సరఫరాతోపాటు సింగరేణిలో శ్రీరాంపూర్, ఆర్‌కెపి, ఇందారం, చెన్నూర్, మందమర్రి ప్రాంతాలకు తాగునీటితో పాటు విద్యుత్ సరఫరా అందించాలన్న లక్ష్యంతో పనులు చకచక సాగుతున్నాయి.