కృష్ణ

సిఎం రిలీఫ్ ఫండ్ వినియోగంలో రాష్ట్రంలోనే బందరుకు రెండవ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కోనేరుసెంటర్): ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్రంలోనే బందరు నియోజకవర్గం రెండవ స్థానంలో నిలిచిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వివిధ రకాల వ్యాధులతో బాధ పడుతున్న ముగ్గురికి బుధవారం కోనేరుసెంటరులో సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన మొత్తాన్ని మంత్రి రవీంద్ర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చినయాదర గ్రామానికి చెందిన రావిశెట్టి శ్రావణి గత ఆరేళ్లుగా కాలేయం వ్యాధితో బాధ పడుతోందన్నారు. శస్త్ర చికిత్సకై రూ.21లక్షలు అవసరం కాగా సిఎం రిలీఫ్ ఫండ్ నుండి రూ.10లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని మంత్రి చెక్కు రూపంలో బాధితురాలికి అందజేశారు. అలాగే పల్లెతుమ్మలపాలెం గ్రామానికి చెందిన ఒడుగు విజయలక్ష్మికి లక్ష రూపాయలు, వీరభద్రరావుకు రూ.35వేలు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, టిడిపి సీనియర్ నాయకుడు గొర్రిపాటి గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు.
పారంభమైన మువ్వ వేణుగోపాలుని కల్యాణ బ్రహ్మోత్సవాలు
కూచిపూడి: సరస శృంగార భక్త్భివాలను కలిగించే మహాకవి క్షేత్రయ్య పదార్చనలతో మొవ్వ గ్రామం పులకించింది. విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం దత్తత ఆలయమైన మొవ్వ శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ మువ్వ వేణుగోపాల స్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏఇఓ శ్రవణం అచ్యుతరామయ్య పర్యవేక్షణలో ఆలయ అర్చకులు దీవి సీతారామ హనుమాన్, వంశీమోహన్ ఆధ్వర్యంలో వైఎల్‌ఎన్ ఆచార్యుల యజ్ఞ బ్రహ్మత్వంలో వేద పండితులు వైఖానస ఆగమరీతిలో స్వామికి ప్రత్యేక పూజలు, ధ్వజారోహణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామిని పూలమాలలతో పెండ్లి కుమారునిగా అలంకరించి భక్తులను పరవశింప చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన ఎన్‌సి రాజ్యలక్ష్మి క్షేత్రయ్య పదాలను ఆలపించారు. అనంతరం క్షేత్రయ్య ఆరాధనోత్సవంగా నగర సంకీర్తన నిర్వహించారు. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘రాయపూడి’ నిరవధిక దీక్ష భగ్నం
అవనిగడ్డ: అవనిగడ్డ ఏరియా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయాలంటూ గత మూడు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న జనసేన నాయకుడు రాయపూ డి వేణుగోపాలరావు, కాంగ్రెస్ నాయకుడు అవనిగడ్డ రజనీకాంత్‌ల దీక్షను మంగళవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. అర్ధరాత్రి 12.30గంటల సమయంలో రజనీకాంత్‌కు బిపి పెరిగి ఫిట్స్‌లా వచ్చింది. వెంటనే ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. కృష్ణదొరకు సమాచారం ఇవ్వటంతో అవనిగడ్డ వైద్యశాలలోనే చికిత్స చేశారు. అనంతరం రాయపూడి వేణుగోపాలరావుకు బిపి, గ్లూకోజ్ లెవల్స్ తగ్గిపోవటంతో దీక్ష విరమించాలని అవనిగడ్డ ఎస్‌ఐ మణికుమార్ కోరారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, దీక్ష విరమించేది లేదని వేణుగోపాలరావు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు బలవంతంగా వేణుగోపాలరావును వాహనంలో ఎక్కించారు. వేణుగోపాలరావుతో పాటు రజనీకాంత్‌ను మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గురువారం ఒక రోజు దీక్షకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఆది రామ్మోహనరావును పోలీసులు అడ్డుకున్నారు. షామియానా, కుర్చీలను తొలగించారు. చల్లపల్లి ఎస్‌ఐ చంద్రశేఖర్‌తో పాటు పెద్ద ఎత్తున పోలీసులు దీక్షాస్థలి వద్ద మోహరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇరువురు నేతలను వైసిపి నాయకులు సింహాద్రి రమేష్, కె నరసింహరావు, కాంగ్రెస్ నాయకులు మత్తి వెంకటేశ్వరరావు, డా. రాధిక మాధవి, కాపునేతలు బాడిగ నాంచారయ్య తదితరులు పరామర్శించారు.
చికిత్స పొందుతున్న అనాథాశ్రమ విద్యార్థి మృతి
ఎ కొండూరు: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంపాటి ప్రవీణ్ (13) బుధవారం మృతి చెందినట్లు మైలవరం సిఐ డి వెంకటరమణ తెలిపారు. వీరు తెలిపిన వివరాల ప్రకారం మారేపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ కంభంపాడులోని మదర్‌థెరిస్సా అనాథాశ్రమంలో ఉంటూ జిల్లా పరిషత్‌ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గత నెల 26న వార్డెన్ కాటూరి వెంకటేశ్వరరావు విద్యార్థి ఒంటిపై కిరోసిన్ పోసి హత్యాయత్నానికి పాల్పడినట్లు సిఐ చెప్పారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రవీణ్ మృతి చెందినట్లు సిఐ తెలిపారు. విద్యార్థి ఇచ్చిన వాగ్మూలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వార్డెనుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

మహిళా పార్లమెంట్
ఏ మహిళా సాధికారత కోసం?
* ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ
నూజివీడు: మహిళా పార్లమెంట్ పేరుతో మహిళాసాధికారతకు తూట్లు పొడస్తూ మహిళలను మోసం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధపడుతున్నారని అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు టి అరుణ ఆరోపించా రు. బుధవారం ఆమె సంఘం కార్యాలయంలో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని, మద్యపానాన్ని పూర్తిగా నిషేదిస్తామని, యువతకు ఉపాధి కల్పిస్తామని, మహిళాభివృద్ధికి కృషి చేస్తానని వాగ్దానం చేసి ఏ ఒక్కటీ అమలు చేయలేదని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయని మీకు మహిళా హక్కుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. వేతనాలు పెంచమని ధర్నా చేసిన అంగన్‌వాడి కార్యకర్తలను లాఠీలతోకొట్టించి, వీడియోలు తీయించి షోకాజ్ నోటీసులు పంపిన చరిత్ర వారిదని ఆ మె ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహం వ్య క్తం చేశారు. అలాగే రాష్ట్రంలో విద్యార్ధులపై జరుగుతున్న దాడులను నియంత్రించలేకపోవడం చిగ్గుచేటన్నారు. కాల్‌మనీ పేరుతో మహిళలను సెక్స్ రాకెట్‌లోకి దించిన తమ పార్టీ టిడిపి నాయకులను వారేం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లు ఉసే ఎత్తడంలేదని ప్రభుత్వ పనితీరును దుయ్యబట్టారు. సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.

ఇరిగేషన్ అధికారులకు సన్మానం
చల్లపల్లి: పట్టిసీమ నుండి కృష్ణాడెల్టాకు గోదావరి జలాలు అందించి పంటలను కాపాడటంలో సహకరించిన ఇరిగేషన్ అధికారులు, సిబ్బందిని నీటి సంఘాల ప్రతినిధులు బుధవారం ఘనంగా సత్కరించారు. చల్లపల్లి ఇరిగేషన్ కార్యాలయంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు నిడమానూరి దిలీప్‌కుమార్ అధ్యక్షతన కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దిలీప్‌కుమార్ మాట్లాడుతూ గోదావరి జలాలతో రైతులకు మేలు జరిగిందన్నారు. చల్లపల్లి డిసి పరిధిలో 33వేల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, ఆయకట్టులో 95 శాతం పైగా పంటలు సమృద్ధిగా పండాయన్నారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ డిఇ వేణుగోపాలరావు, చల్లపల్లి ఎఇ శ్రీనివాస్, పులిగడ్డ సెక్షన్ హెడ్ వర్క్స్ ఎఇ రామ్‌కుమార్‌లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలు నీటి సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.