రాష్ట్రీయం

మా పార్టీలోకి రండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయరామారావుకు కెటిఆర్ సాదర స్వాగతం * త్వరలో కెసిఆర్‌ను కలుస్తానన్న సిబిఐ మాజీ చీఫ్

హైదరాబాద్, డిసెంబర్ 12:సిబిఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కె విజయరామారావు టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఐటి మంత్రి కె తారక రామారావు శనివారం విజయరామారావు నివాసానికి వెళ్లి తమ పార్టీలోకి రావలసిందిగా ఆహ్వానించారు. విజయరామారావు టిడిపికి శుక్రవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల తరువాత కెసిఆర్‌ను కలువనున్నట్టు విజయరామారావు తెలిపారు. ఈ సందర్భంగా కెటిఆర్ , విజయరామారావు మీడియాతో మాట్లాడారు. టిఆర్‌ఎస్ పార్టీ ఇతర పార్టీల వారిని చేర్చుకోవడం అక్రమం అని విపక్షాలు చేస్తున్న విమర్శలను విలేఖరులు ప్రస్తావించగా, ప్రజాస్వామ్యంలో పార్టీలు మారే హక్కు ఉంటుందని కెటిఆర్ తెలిపారు. ఇప్పుడు విమర్శిస్తున్న జానారెడ్డి పార్టీ మారలేదా? అని కెటిఆర్ ప్రశ్నించారు. టిడిపి నుంచి జానారెడ్డి కాంగ్రెస్‌లో చేరారని, చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరిన వారే కదా? అని అన్నారు. జానారెడ్డి, చంద్రబాబు పార్టీలు మారవచ్చు కానీ వారి పార్టీల ఎంపిటీసిలు, జెడ్‌పిటీసిలు పార్టీలు మారకూడదా? అని ప్రశ్నించారు. ఒక్క టిఆర్‌ఎస్‌లోకే వలసలు వస్తున్నట్టు, టిఆర్‌ఎస్ ఏదో తప్పు చేస్తున్నట్టు విపక్షాలు మాట్లాడడం సరికాదని అన్నారు.
తనకు బెదిరింపు కాల్ వచ్చిందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ చేసిన ఆరోపణ గురించి ప్రస్తావించగా, షబ్బీర్ అలీని బెదిరించే ధైర్యం మా పార్టీకి ఉందా? అని అన్నారు. ఆయనకు బెదిరింపు కాల్ వచ్చినట్టు తెలిసిందని, దానిపై విచారణ జరుగుతుందని తెలిపారు. తాము, టిఆర్‌ఎస్ కార్యకర్తలు బెదిరింపులకు పాల్పడే ప్రసక్తే లేదని అన్నారు. నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని అన్నారు.
టిఆర్‌ఎస్‌లో చేరాలని తనను ఆహ్వానించారని, రెండు రోజుల్లో కెసిఆర్‌ను కలువనున్నట్టు విజయరామారావు తెలిపారు. రాష్ట్భ్రావృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందని, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయానికి కృషి చేస్తానని అన్నారు. (చిత్రం) కె విజయరామారావును తమ పార్టీలోకి రావలసిందిగా ఆహ్వానిస్తున్న ఐటి మంత్రి కె తారక రామారావు