రాష్ట్రీయం

అందరికీ అందుబాటులో విమానయానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం
విదేశీ పెట్టుబడులకు అనుమతి
భారత విమానయాన శాఖ
కార్యదర్శి ఆర్‌ఎన్ చూబె

హైదరాబాద్, మార్చి 17: దేశంలో పౌర విమానయాన రంగం అభివృద్ధికి కేంద్రప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సహిస్తుందని, 2020 నాటికి మధ్యతరగతి ప్రజలుకూడా విస్తృతంగా విమానాల్లో ప్రయాణించేలా చూడాలని చూస్తామని, అందుకు 800 విమానాలు అవసరమని భారత పౌర విమానయాన సర్వీసుల శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చుబె అన్నారు. దేశంలో ఎంఆర్‌ఓ (మెయింటనెన్స్, రిపేర్, ఆలోవర్) సేవలందించేందుకు విమాన సంస్థలకు విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతించిందని ఆయన తెలిపారు. గురువారం నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న ఏవియేషన్ ఇండియా-2016 సదస్సు రెండోరోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనాభా ఎక్కువ ఉన్న భారత్‌లో విమాన ప్రయాణం చేసే వారు కేవలం 4.6శాతమేనని అన్నారు. మరికొన్ని విమానాశ్రయాలు ఏర్పాటు చేయడం ద్వారా మధ్యతరగతికి చెందినవారు కూడా విమాన ప్రయాణం చేసే సౌకర్యం కల్పించాల్సి ఉందన్నారు. ఈ దిశగా భారత విమానయాన శాఖ కృషి చేస్తోందన్నారు. గత సంవత్సరం భారత్‌లో 85 విమానాశ్రయాల ద్వారా 190 మిలియన్ల ప్రయాణికులకు సేవలందించామని, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ అంతగా లేనందున విమాన ప్రయాణం మధ్యతరగతికి అందుబాటులో లేకుండా పోతోందని డాక్టర్ చుబే అన్నారు. 2036 నాటికి భారత్ వైమానిక రంగంలో ప్రపంచంలోనే అగ్రస్థానం సాధించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అగ్రదేశాల సరసన చేరిన భారత్ తొమ్మిదో స్థానం నుంచి రాగల రెండేళ్లలో మూడో స్థానానికి చేరనుందన్నారు. విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న భారత్‌లో వైమానిక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ముందుకొస్తున్నాయని, వారిని కేంద్రం ప్రోత్సహిస్తుందని తెలిపారు.