వినదగు!

ఆత్మ తన అస్తిత్వాన్ని కోల్పోదు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అంతవంత ఇమే దేహా నిత్య స్యోక్తాః శరీరిణః
అనాశినో మేయస్య తస్మా దుధ్యస్వ భారత’ (2-18)
ఇంతకీ దేహం అంటే ఆత్మ ధరించిన పాంచభౌతికత. దేహం పంచభూతాత్మకం కాబట్టి ఏదో ఒకనాటికి పంచభూతాలు విడిపోవలసిందే... దేహం ప్రిదిలిపోవలసిందే. పంచభూతాత్మకం కావటం జననం.. పంచభూతాలు విడివడటం మరణం. అంటే దేహాన్ని వీడిన ఆత్మ యథాస్థితికి చేరుకుంటుందన్న మాట. అంటే అద్దె ఇంటిని ఖాళీ చేసి స్వగృహాన్ని చేరుకుంటుంది. విశ్వమే దాని స్వగృహం. అందుకే అనేది ఆత్మని నిత్యం అని.. అవినాశనం అని.. అప్రమేయం అని.
కాబట్టి ఆత్మ ధరించినదేదో అదే నశిస్తుంది తప్ప ఆత్మ తన అస్తిత్వాన్ని ఏ మాత్రం కోల్పోదు. అన్నట్టు ఆత్మస్థితి ప్రత్యక్ష ప్రమాణాలకు అందే స్థితి కాదు. అలా ప్రత్యక్ష ప్రమాణాలకు అందుతున్నదంతా దేహస్థితే. కాబట్టి ధీరుడు, ఆత్మజ్ఞాని దేహాలను చూడటం మాని ఆత్మలను మాత్రం చూస్తూండాలి. అప్పుడు కర్తృత్వం కుదిపేయదు.. ఫలితాసక్తి వేధించదు. అందుకే కృష్ణుడు ఆత్మజ్ఞానోపదేశానికి పూనుకుని అర్జునుడిని యోధునిగా చైతన్యపరిచే ప్రయత్నం ప్రారంభించాడు.
పోరుబాటలో మానసిక భ్రమల నుండి బయట పడాలనుకుంటాడు. యుద్ధం చేయటమే అన్ని విధాల అర్జునుడి ధర్మం... మనమూ అంతే. గొప్పగొప్ప చదువులు చదివి వృత్తిని చేపట్టనంటే ఎలా? కాబట్టి వృత్తి ధర్మాన్ని కాదనటం కార్యాచరణ నుండి తప్పుకోవటమే! జీవితంలో పోరాడాల్సిందే! జీవితమంతా పోరాడుతుండాల్సిందే!!
‘య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్
ఉ భౌ తౌ న విజా నీతౌ నాయం హంతి న హన్యతే’ (2-19)
మనదంతా ద్వంద్వ ప్రవృత్తి. అవసరానికి తగ్గట్టు ఎటైనా దూకెయ్యగలం. అర్జునుడు పెరిగింది యుద్ధం చేయాలనే లక్ష్యంతోనే. కురుక్షేత్రాన్ని క్షత్రియ ధర్మంతోనే చేరుకున్నాడు. ప్రాపంచిక పరిధులలో స్థైర్యాన్ని కోల్పోయి నీరసించాడు. యుద్ధం భౌతిక, మానసిక క్రీడ.. ఆ మనసునూ దాటితే ఆత్మక్రీడ. సంహరించటమూ, సంహరించబడటమూ అంతా ఆటనే. కాబట్టి ‘సంహరణ’ అనే క్రియ ఏ విధంగా చూసినా దేహానిదే తప్ప ఆత్మది కాదు. అయితే ఈ రెండు క్రియల్ని విడివిడిగా చూడటం మన తెలివితక్కువతనం. ధీరత్వం ఆత్మను ఆవరించి ఉంటుందే తప్ప దేహాన్ని ఆవరించి ఉండదు. అంటే ఆత్మను పట్టించుకోకుండా దేహాన్ని పట్టుకు వేలాడుతుండటం అజ్ఞానమే! ఆత్మను చంపుతుందనటం, చస్తుందనటం ఆత్మజ్ఞానం కాదు.. అది ఆత్మను గురించిన అవగాహన లేకుండటమే. మరణించేదిగాను, మరణింపజేసేదిగాను చూడటం మన అజ్ఞానం. ఆత్మది అక్షయ తత్వం. అది క్షణాల వెంట పడదు.. క్షణిక వర్తనం సాగించదు.. అది దేహంతో పోటీ పడదు.. కాలంతో ప్రవహిస్తుంటుంది... అందుకే ఆత్మది చిరయశస్సు.. చిరంజీవత్వం.

-డా.వాసిలి వసంతకుమార్ 93939 33946