వినదగు!

అంతరంగ హోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నా తెలివితేటలకు కొదవలేదు.. నాకు అంతా తెలుసు’ అనుకోవటం పెద్ద పొరపాటు. అంటే జారుడుబల్లపై నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూ, జారిపోతూ బింకం ప్రదర్శించటం. నిజంగానే కాస్త పట్టు దొరకినా నిలదొక్కుకోవటం కష్టం. అర్జునుడు అన్నీ తెలుసును అనుకునే కురుక్షేత్రంలోకి అడుగుపెట్టాడు. అంతటా తెలిసిన ప్రపంచమే. అయినా ఆ తెలిసిన ప్రపంచమే మళ్లీ తనను ప్రశ్నించింది. పునః సమీక్షించుకునేలా చేసింది. ఆ తెలిసిన ప్రపంచం ఉంటేనే తన ఉనికి సార్థకం అయ్యేది. అదే లేనప్పుడు తన అస్తిత్వం ప్రశ్నార్థకమే. అలా బింకంగా ఉండలేక అర్జునుడు ఒక్కసారిగా బిక్కచచ్చిపోయాడు. ‘జీవన సత్యం’ ‘జీవిత వాస్తవం’ కళ్ల ముందు నిలబడింది. వర్తమానం ప్రశ్నార్థకం కావటంతో కృష్ణుడ్ని ఆశ్రయించక తప్పలేదు.
కృష్ణుడు అంటే పూర్ణ పురుషుడు... సంపూర్ణ వ్యక్తిత్వ సంపన్నుడు. ఇంద్రియ భోగాలకు అతీతుడు.. నవరసాలను ఒకేలా అందుకోగలవాడు. సింపుల్‌గా చెప్పుకోవాలంటే సంయమనశీలి. ఈ సంయమనం కొరవడినవాడు మన లాంటి అర్జునుడు. పూర్ణత్వాన్ని చూసి అసంపూర్ణత సంపూర్ణమయ్యే ప్రయాణం ప్రారంభిస్తుంది. తెలిసిన అంశాలు సమయానికి ఆదుకోకపోయినా మనలో అసంపూర్ణత నెలకొని ఉన్నట్లే. శత్రువును ఎదుర్కొనే ఆయుధాలు మన దగ్గరే ఉంటాయి... వాటిని ప్రయోగించే మెళకువలూ తెలుసు. అయినా సమయానికి వాటిని ప్రయోగించాలన్న ఆలోచన రాదు... పోనీ ఆలోచన వచ్చిన ప్రయోగించే మెళకువ స్ఫురించకపోవచ్చు. అంటే తెలివితేటలకు కొదవలేదు.. అన్నీ తెలిసినవే.. అయినా..???
కృష్ణుడిలో ఇహానికి చెందిన జ్ఞాన విజ్ఞానాలు సంపూర్ణంగా ఉన్నాయి, పరానికి చెందిన పరేంగిత ప్రజ్ఞా పరిపూర్ణంగా ఉంది. కాబట్టే గీతోపదేశంలో కృష్ణుడు కేవలం ప్రాపంచికమైన మానవ ధర్మాలు, మానవ విలువలు, మానవ తత్వాలు, మానవ మనస్తత్వాలకే పరిమితమై పోలేదు.. మానవత్వంలో మన ఇహాన్ని దున్ని దివ్యత్వంతో ఫలసాయాన్ని పొందే తీరును ఉపదేశామృతంగా మన ముందుంచాడు. ‘ప్రజ్ఞా వాదాంశ్చ భాషసే’ అంటూ మొదట్లోనే కృష్ణుడు అర్జునుడికి ఒక చురక వేస్తాడు. ప్రజ్ఞావంతుడిలా మాట్లాడుతున్నావు? కాని ప్రయోజనం ఏమిటి?’ అనటంలో తెలివుండీ ప్రయోజనం ఏమిటి, అవసరానికి అక్కరకు రానప్పుడు - అన్న ఎత్తిపొడుపు ఉంది. ఇటువంటి అర్థవంతమైన చురకతో అర్జునుడి హృదయ కాలుష్యాన్ని తుడిచేస్తాడు.. మనసును పిండి ఆరేస్తాడు. ఇలా ప్రేమ సామ్రాజ్యమైన అనాహత ప్రాంగణం నుండి విశుద్ధం గుండా ఆజ్ఞా ప్రాంగణాన్ని చేరుస్తాడు. అనాహత, విశుద్ధాల వరకూ మనం ఇంకా ఇహంలోనే ఉన్నట్లు. ఆజ్ఞను చేరుకోగలిగితే ‘పర’ ప్రవేశం లభించినట్లు.

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946