వినదగు!

కాలజ్ఞానం ఆత్మజ్ఞానమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూతలంలో కురుక్షేత్రం ఒక మహాసంగ్రామం.
మానవతనంలోనూ కురుక్షేత్రం నిరంతర సంగ్రామమే!
మానవ సమాజంలో, పోనీ సామూహిక నేపథ్యంలో కురుక్షేత్రం ఒక ప్రపంచ యుద్ధం అయితే వైయక్తికంగా అంటే మనలోని ప్రతి ఒక్కరి పరంగా కురుక్షేత్రం ఒక అంతర్యుద్ధం. ఈ కోల్డ్‌వార్‌కు ప్రతీకలే మన ఎమోషన్స్.
* * *
‘ఆత్మ’గీతకు ఎమోషన్స్ ఉండవు... కానీ జీవన గీత మాత్రం ఎమోషన్లమయమే! అంటే ఉద్రేకాలు, ఉద్విగ్నతలు లేనిది ఆత్మ అయితే, ఆ ఆత్మ కొలువై ఉండే మానవ అవతారం మాత్రం భావోద్రేకాల, భావోద్విగ్నతల క్షేత్రమే! అవును, మన దేహాన్ని, మనస్సును దాటనంత కాలం మన జీవన ప్రయాణం ఒక రణరంగంలా సాగుతుంటుంది. ఇక్కడ రణరంగం అంటే సంఘర్షణామయ జీవితం అని.
* * *
ఎమోషన్స్ తాకని ఆత్మతత్వం దివ్యతత్వమే... ఎమోషన్స్‌లో కూరుకుపోతున్న మానవతత్వం మాత్రం కురుక్షేత్రాన్ని తలదనే్న ఉద్వేగ క్షేత్రమే! కష్టం, బాధ, దుఃఖం, విషాదం - ఈ నాలుగంశాల మధ్యనా సాగని మానవ అవతారం ఒక్కటైనా ఉంటుందా?! ‘ఉండదు’ అనటానికి కురుక్షేత్రంలోని ప్రతీ యోధుడూ ఒక నిలువెత్తు సాక్ష్యమే!
* * *
అసలు దేహం, మనస్సు, మాట - ఈ మూడూ వాసమున్న మానవ అవతారాలకు భగవత్ గీత అవసరమే! కారణం దేహం, మనసు, మాట అవసరం లేని నిర్గుణ మానవ అవతరణ సాధ్యం కాలేదు కాబట్టి. కురుక్షేత్రంలోకి అడుగు పెట్టిన ప్రతీ యోధుడూ సగుణ మానవ అవతారులే కానీ నిర్గుణ మానవ అవతారులు కాదు.
* * *
సగుణ మానవ అవతారం అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌కు రూప ఆవిష్కారం. పైగా ఈ రూపం భావోద్విగ్నతలను, భావోద్రేకాలను ఆదరిస్తూనే ఉంటుంది. అది కేవలం ఆదరణే కాదు ఆరాధన కూడా! అంటే తెలిసైనా, తెలీకైనా అక్కున చేర్చుకోవటం జరుగుతోంది. కాబట్టే అవి మానవ క్షేత్రాలలో తిష్ఠ వేస్తున్నాయి.
* * *
మన ముంగిట తిష్ఠ వేసుకున్నాయి అని తెలియటమే తత్వజ్ఞానం. ఆ తత్వజ్ఞానంతో మన మానసిక క్షేత్రం నుండి బయటపడగలగటమే విద్వత్ సన్యాసం. అంటే మానసిక జగత్తు నుండి, వాసనామయ జగత్తు నుండి తప్పుకోవటం. ఇక్కడ తప్పుకోవటం అంటే తప్పించుకోవటం కాదు. తప్పుకోవటం విద్వత్ సన్యాసం అవుతుందే కానీ తప్పించుకోవటం విద్వత్ సన్యాసం మాత్రం కాదు.
* * *
విద్వత్ సన్యాసం వల్లనే స్థిత ప్రజ్ఞత్వం సాధ్యమవుతుంది. అంటే భావోద్విగ్న క్షేత్రంలో సాధనా క్రమంలో యమ, నియమ, సంయమ, ధారణ, ధ్యాన, సమాధి స్థితులను సాధించటం.. చివరకు స్థితప్రజ్ఞత్వాన్ని పొందటం. ఈ స్థితప్రజ్ఞ సాధనకు మనలోని ప్రతి ఒక్కరికి ఒక ‘స్వ-తంత్రం’ కావాలి. అది ‘స్వ-్భవం’ నుండి పుట్టుకు రావాలి.. ఆ స్వభావానికి కావలసింది ‘స్వ-జ్ఞానం’. స్వజ్ఞానంతో స్వభావం స్వతంత్రం కావాలంటే మనం జాగృతం కావాలి. ఈ జాగృతికి కావలసిన భూమికనే భగవద్గీత.
* * *
భూమి పొరలను చేరిన విత్తు మొలకెత్తాలంటే ‘తడి’ తగలాల్సిందే! తానున్న నేల చిత్తడి క్షేత్రం కావలసిందే!! మనమూ అంతే... మన మానవ క్షేత్రం సైతం చిత్తడి కావలసిందే! మనమూ ‘తడి’సి ముద్దవ్వాల్సిందే!అలా తడిసి వొణుకుతున్న వాడు అర్జునుడు. ఆ తడి తగిలింది దేహానికి కాదు... మనసును తడిపింది.. మనసును కుదిపింది.. మనసును క్రుంగదీసింది.. చివరికి కృష్ణుడి చేత అర్జునుడి స్థితి ‘హృదయ దౌర్బల్యం’ అనిపించింది. అర్జునుడికి సైతం తాను కార్పణ్య దోషోపహత స్వభావానికి లోనయినట్లు ఎరుక అయింది.
* * *
అర్జునుడు ‘నేను’ అన్న ‘అహం’తోనే కురుక్షేత్రంలోకి అడుగుపెట్టాడు. అందుకే ‘నా వారు’ అన్న ఎమోషన్‌కి లోనయ్యాడు. చేయబోయే యుద్ధంలో తానే కర్తనని, కర్మత్వం తనదే అవుతుందని తలపోశాడు కాబట్టే ‘హత్వార్థ కామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్’ అనుకున్నాడు. యుద్ధానంతర జీవితమంతా రక్తంతో ‘తడి’సిన భోగంలా కళ్ల ముందుకొచ్చింది.
ఇంతకీ మానవ అవతారంలో ‘కర్త’ ఉన్నాడు కానీ మానవ అవతరణలోని ఆత్మ మాత్రం ‘అకర్త’నే! అంటే దైహిక జ్ఞానంతో మనం కర్తలమే! ఆత్మజ్ఞానంతో అకర్తలమే!! ఇలా మానవ అవతారులమైన మనం సదా నిరాకార ఆత్మలమే! అంటే మానవ శరీరంతో మనం వర్తమాన జన్మలమే! కానీ ఆత్మజ్ఞానంతో భూత భవిష్య వర్తమానాలలో నిత్యం ‘వ్యాపించి’ ఉన్నవారమే! అంటే ఉండటం, ఉండకపోవటం అన్నది దేహానికే తప్ప ఆత్మకు కాదు. ఆత్మ సదా శాశ్వతమే. ఈ అంశానే్న భగవద్గీత-
‘న త్వేవాహం జాతునాసం.../ న చైవ న భవిష్యామ స్సర్వే
వయమతః పరమ్’ అంటూ స్పష్టం చేస్తోంది.
అంటే, కాలం పరివ్యాప్తమై ఉన్నంతకాలం ఆత్మ వ్యాప్తమయ్యే ఉంటుంది. ఈ కాలజ్ఞానం ఆత్మజ్ఞానమే.

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946