వినదగు!

సాంసారిక క్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నశించే స్థితి నుండి నశించని స్థితిగా పరిణమించి అనంతంగా స్థితం కావటం సాధ్యమా?
ఒక విధంగా నశించని ఆత్మ నశించే దేహాన్ని చేరుకుని అనంతంగా పరిణమించగలదా?
భౌతికత అధిభౌతిక స్థితిని చేరుకుని అనంతంగా స్థితం కావటమే స్పిరిట్యుయాలిటీ. భౌతికం అధిభౌతికంగా పరిణమించినట్లుగానే భూతాత్మ పోనీ జీవాత్మ అధిఆత్మ అంటే అధ్యాత్మగా పరిణమించటమే ఆధ్యాత్మికం... అధ్యాత్మ అనంతాత్మ కావటం.
గికంగా సాధ్యవయ్యే ఈ సెల్ఫ్ - సోల్ - స్పిరిట్‌ల పరిణామాన్ని భగవద్గీత క్షర - అక్షర - అనంత దశలుగా చెప్తోంది. క్షర పురుష - అక్షర పురుష - పరమ పురుషలుగా వింగడిస్తోంది. పరమ పురుష తత్వానే్న పురుషోత్తమ తత్వంగా విపులీకరిస్తోంది. పరమ పురుష సాధననే ‘పురుషోత్తమ యోగం’ అంటోంది. ఇలా ఆత్మ - బ్రహ్మ అభేదం కావటమే అహం బ్రహ్మాస్మి... అద్వైత సిద్ధి. ఈ బ్రాహ్మీ స్థితి క్షర, అక్షర స్థితులకంటే అతీతమైంది.
* * *
ఇంద్రియాలు ఆత్మవర్తనానికి ఆటంకాలు.. ఆత్మ స్వతంత్రను అడ్డుకుంటాయి. అందుకే ఆత్మ ఆధ్యాత్మిక వర్తనంలో దేహాతీతం అవుతుంటుంది. దేహాన్ని ఆశ్రయించి ఉన్నంతకాలం ఆత్మది డిపెనె్డన్సీనే. దేహాన్ని వీడితే తప్ప ఆత్మకు ఇండిపెనె్డన్సీ సాధ్యంకాదు. మృత్యువు ఆసన్నమైనపుడు అది దేహం నుండి వన్స్ ఫర్ ఆల్ బయటపడుతుంది. దీనే్న మనం ముక్తి, విముక్తి అంటుంటాం. అయితే యోగ సాధనాపరంగా ఆత్మ దేహాన్ని పూర్తిగా వీడకుండానే ఈథరల్, యాస్ట్రల్‌గా విడివడుతుంది. ఈ స్వతంత్రతనే గికంగా ‘ఇన్డిపెనె్డన్సీ’
వానవ అవతారంలో ఆత్మ దేహ ప్రవేశం చేసింది దేహం నుండి సాధ్యమైనంత త్వరగా ఆ దేహాన్ని వీడటానికి కాదు... శాశ్వతంగా సాధ్యమైనంత త్వరగా క్షర స్థితి అయిన తనువు నుండి బయటపడి అక్షరం కావటానికి కాదు... నిజానికి, ఆత్మ దేహాన్ని ఆశ్రయించింది క్షరత్వంలో అక్షరత్వాన్ని నిలపాలనే లక్ష్యంతోనే. అంటే నశించే తత్వంలో నశించని తత్వాన్ని నింపాలి. ఇదే ‘్ఫజికల్ ఇమ్మోర్టాలిటీ’. అంటే, ఒక విధంగా భౌతిక అమరత్వ సాధనే పురుషోత్తమ యోగం. గుణత్రయ స్థితి నుండి గుణాతీత స్థితిని చేరుకోవటం. అందుకు చేసే ప్రయత్నం యోగ సాధన.
ఇంతకీ గుణత్రయ స్థితి అంటే ‘సంసార స్థితి’. అందుకే మానవ ఎదుగుదలను ‘సంసార వృక్షం’గా చెప్పుకుంటుంటాం. ఈ సంసార వృక్షాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చి చెప్పుకోవచ్చు. కారణం అశ్వత్థ వృక్ష వేర్లు భూమిలోనూ ఉంటాయి... భూమిపైనా ఉంటాయి. ఆ వేర్లే ఎంతో ఎత్తుల నుండి ఊడలుగా దిగి భూమిలోకి చొచ్చుకుపోతాయి. కనిపించే ఊడల రూపంలోను, కనిపించని వేర్ల రూపంలోనూ అశ్వత్థ వృక్షం విస్తృతమవుతూ బలపడుతుంటుంది.
ఊడలు దిగిన ఈ అశ్వత్థ వృక్షాన్ని చూస్తే వృక్ష మొదలేదో తెలీదు. అనేక ఊడలతో నేలను తన్నుకుని వ్యాపితం కావటం మాత్రం వాస్తవం. విశ్వాత్మ అయిన పురుషోత్తమ తత్వం సైతం అశ్వత్థ తత్వం వంటిదే. పురుషోత్తమ తత్వమూ అనేక విధాలుగా వ్యాప్తవౌతుంటుంది. పరార్థ జగతి నుండి పదార్థ జగతిలోకి అనేక ఊడలుగా దిగుతుంది. గీతలో కృష్ణుడు తాను పురుషోత్తముడ్నని అనటమూ, భౌతిక ప్రకృతిలోని ప్రతి అంశలో ఉన్నది తానేనని అనటమూ ఇందువల్లనే!
మనలోని భూతాత్మ తత్వం సైతం సాంసారికంగా అనేక విధాలుగా అల్లుకుపోయి ఉంటుంది. అధ్యాత్మగా ఎదుగుతూ మరల మరల భూతాత్మగా ఊడలు దిగుతుంటుంది. ‘పర’ లక్ష్యానికి చేరువ అవుతూనే వెనుతిరుగుతూ భౌతిక బంధాలను కాదనలేకపోవటం మానవ నైజం అవుతోంది. ఈ స్వభావానే్న మనం ఆధ్యాత్మిక మాయ అనుకుంటున్నాం- బయటపడలేక. అందుకే మన మానవ అవతారాన్ని సంసార వృక్షం అనేది... భౌతికంగా ఊడలు దిగుతోంది పురుడు పోసుకుంటున్న ఆలోచనలతోను, పుట్టుకొస్తున్న భావోద్రేకాలతోను, అనేకానేక ప్రాపంచిక ప్రభావాలతోను, ఇటువంటి ప్రభావాల ఫలితం సాంసారిక జీవనం కాబట్టి ఈ మానవ వృక్షాన్ని ఖగోళ వృక్షం... కాస్మిక్ ట్రీ అనీ అంటుంటాం. జనన మరణ చక్రబంధం వల్లనూ వరల్డ్ ట్రీ అంటుంటాం.
ఇక్కడ సంసారం అంటే భౌతిక జీవనం... పదార్థ ప్రాపంచిక వర్తనం.. భూతాత్మ మనుగడ... మామూలు వృక్షానికి వేర్లు భూమిలోనే ఉంటాయి. దాని మనుగడ అంతా పదార్థ ప్రకృతిలోనే. కానీ అశ్వత్థ వృక్ష వేర్లు పరార్థ జగతికీ వ్యాపించి అక్కడి నుండి పదార్థ జగతినీ చేరుతున్నట్లుగానే భూతాత్మ అధ్యాత్మగా ఆకాశ తత్వమైన పరార్థ జగతిలోకి వ్యాపిస్తూనే పదార్థ జగతిలోకీ దిగుతుంటుంది. కృష్ణుడు ‘ఊర్థ్వమూల మధః శాఖ మశ్వత్థం ప్రాహుర వ్యయమ్’ అని నుడివిన శ్లోక సారార్థం ఇదే! అంటే సంసారమే ఒక అశ్వత్థ వృక్షం. ఈ వృక్ష మొదలు నేల నుండి పైకి ఎదిగినా అహంకారాదులు ఊడల్లా క్రిందికి దిగుతూ నేలబారు జీవితాన్ని తలపింపజేస్తుంటాయి.
సంసార వృక్షం త్రిగుణాలతో ప్రవృద్ధమవుతుంటుంది. సత్వ రజః తమో గుణాలతో పెరుగుతూ పోయే సంసార వృక్షం విషయ ప్రవాళమైంది. అంటే ప్రాపంచిక వాసనలను కొమ్మలుగా కలిగి ఉండి పైపైకి ఎదుగుతూ వ్యాపిస్తూ భౌతిక జగతిలో ఊడలు దిగినటువంటిది. పైగా ఈ సంసార వృక్షానికి కర్మలే మొదళ్లు. అవి మానవ సంసారంలో చిక్కగా అల్లుకుపోయి ఉంటాయి. మొత్తానికి మానవ లోకంలో సంసార జీవనం అంటే కర్మానుబంధమే అన్నది స్పష్టం.
సింపుల్‌గా చెప్పుకోవాలంటే అశ్వత్థ వృక్షమనే సంసార వృక్షానికి మానవ జీవితం ఇహంతోను, పరంతోను ముడిపడి ఉంది. ఇహ ప్రవృత్తితో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదుల పరిష్వంగన తప్పదు. ఒక విధంగా ఇవే పర ప్రవృత్తిని ఆటంకపరుస్తుంటాయి. అయినప్పటికీ ఇహం నుండి ఎదిగి పరంలో విస్తరిల్లినట్లనిపించే అధ్యాత్మ, దేహాన్ని ఆశ్రయించి ఉన్నంతవరకు, వాసనామయ జగత్తులో బంధింపబడుతూనే ఉంటుంది. కర్మలు ప్రతికర్మలు, సుఖాలు దుఃఖాలు, మంచీ చెడు, ఇష్టాయిష్టాలు, లాభ నష్టాలు మొదలైన వాసనల మధ్య దోబూచులాడుతూనే ఉంటుంది. అయినా ఆధ్యాత్మ ‘అనంతాత్మ’గా పరిణమించి తీరవలసిందే. ప్రాపంచిక పురుష తత్వం పురుషోత్తమ తత్వంగా నిలదొక్కుకోవలసిందే!
* * *
‘అనంతం’ అంటే ‘అంతం’ లేనిది అని మాత్రమే కాదు... ఎక్కడైతే భూతాత్మ అధ్యాత్మగా చేరుకుంటుందో, అక్కడి నుండి మళ్లీ భూతలం వైపు మరలిరాను ఇచ్ఛగించని స్థితి అనంతం. అంటే అనంతాత్మగా యోగించిన అధ్యాత్మ మళ్లీ భూతాత్మగా దిగి రావటానికి ఇచ్ఛగించదు. అసలు మనం చెప్పుకుంటున్న సంసార వృక్షానికి మొదలు ఈ అనంతంలోనే ఉంది. ఆ ఆద్య పురుషత్వమే పురుషోత్తమత్వం. యోగ సాధనలో సంసార యోగాన్ని త్యజించకుండానే ఆ పురుషోత్తమ యోగాన్ని సాధించాలి.. పరమ పురుషగా పరిణమించాలి. దృఢచిత్తంతోనే సాంసారిక జీవనం సాగిస్తూ పురుషోత్తమ యోగ మార్గాన్ని అనుసరించటం సాధ్యవౌతుంది.
అన్నట్టు యోగ జీవనానికి కావలసింది దృఢచిత్తమే తప్ప వైరాగ్య ప్రవృత్తి కాదు. వైరాగ్యం సన్యాస లక్షణం. కాబట్టి పురుషోత్తమ యోగ సాధనకు కావలసిందీ వైరాగ్య జీవనం కాదు... ‘దృఢేన ఛిత్త్వా’ అంటూ గీత స్పష్టం చేస్తున్న దృఢ చిత్తమే. ఆ దృఢచిత్తం చాలు కామక్రోధాదులతో అల్లుకుపోయిన సాంసారిక జీవనం నుండి విడివడటానికి... పురుషోత్తమ తత్వానికి సామీప్యం కావటానికి.

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946