వినదగు!

యోగజీవనం... విముక్తం కావటానికే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేను’ అంటే మనస్సు + బుద్ధి + ఇంద్రియాలు.
ఈ మూడింటిపై ఆధిపత్యం నెరపగలది జీవాత్మ. ఈ మానవాత్మను సైతం చైతన్యపరచ గలది పరమాత్మ. పరమాత్మ అంటే పరమగతి, పరాకాష్ఠ. ఈ పరమ గతినే మనం పురుష శ్రేష్ఠుడు, పరమ పురుషుడు అని అంటున్నాం.
భౌతికతలోని ఆత్మ తన సామర్థ్యాన్ని గుర్తించనంతవరకు మనసుకి, బుద్ధికి, ఇంద్రియాలకు వశమై ఉండటం జరుగుతుంది. అంటే ఇంద్రియాలు మనసుని, బుద్ధిని మోసగించి మార్గం తప్పేలా చేస్తాయి. ఇంద్రియాలు ప్రాపంచికంగా విషయ సుఖ ఆశ చూపిస్తాయి. ఈ ఇంద్రియాలకు మనసు తోడైతే బుద్ధి సైతం వక్రిస్తుంది. అటు ఇంద్రియాలు, ఇటు మనస్సు బుద్ధి కూడబలుక్కుంటే ఎంతో బలీయమైన ఆత్మ సైతం వాటి అధీనమవుతుంది. ఇటువంటి ఎరుకనే ఆత్మజ్ఞానం.
మన జీవనమే సంసార యోగం. ఈ సంసార యానంలో మనల్ని మనమే ఉద్ధరించుకోవాలంటుంది భగవద్గీత.
‘ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మానమవ సాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః’
భౌతిక జగతిలో మనకు మనమే మిత్రులం... మనకు మనమే శత్రువులం. ఉన్నతిని సాధించటంలోను పతనం కావటంలోను మనకు మనమే బాధ్యులం. అసలు ప్రాపంచిక జీవనం అంటేనే రాగం, ద్వేషం, కామం, క్రోధం, లోభం, మోహం మొదలైన భావోద్వేగాలతో ఎగసిపడుతుండటం, చప్పబడుతుండటం. మన జీవితం సక్రమంగా సాగకపోవటానికి ఈ ఎమోషనే్స మూలం.
ఇంతకీ మన జీవితాన్ని మన అధీనంలో ఉంచుకోవటానికే యోగం. సాధన పురోగమించటానికే తప్ప తిరోగమించటానికి కాదు. మన సాధనా లక్ష్యం ఉత్థానమే తప్ప పతనం కాదు. అంటే సాధనతో మనం జీవాత్మలం కావాలి.
శీతోష్ణాలలోను, సుఖ దుఃఖాలలోను, మానవామానాలలోను సంయమనాన్ని పాటిస్తూ స్థితంగా జీవయాత్ర సాగించటమే జితాత్మలం కావటం. అంటే దేహాభిమానం నుండి బయటపడి, ఇంద్రియ చాపల్యం లేకుండటం.. మనస్సును జయించటం జిత్మాల లక్షణం. ద్వంద్వ ప్రవృత్తి నుండి బయట పడటం కూడా జితాత్మలం కావటమే.
జితాత్మలం కావటం అంటే కేవలం మన అధీనంలో ఉంచుకోవటమే కాదు... ఆశలకు, కోరికలకు అతీతం కావటమే కాదు. ప్రాపంచిక సంపద విషయంలో అర్రులు చాచక పోవటమే జితాత్మ ప్రధాన లక్షణం. భౌతిక లాలసత కంటే అధిభౌతిక లాలసత ముఖ్యం. ఈ లక్షణాలనే
‘ప్రశాంత మనసం హ్యేనం యోగినం
ఉపైతి కాంతరాజసం సుఖ ముత్త మమ్‌న్ బ్రహ్మ భూతమ కల్మషమ్’
అని గీత స్పష్టం చేస్తుంది.
సమదర్శనం సాధ్యమైన సాధనతోనే మనం జితాత్మలం కాగలం. ఇక సర్వప్రాణులను సమంగా చూడటం జితాత్మ లక్షణం. ‘సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనం’.
సమదర్శనం అంటే ఆత్మదర్శనమే. అది అఖండ చైతన్య దర్శనం. అన్ని ప్రాణులలో మన ఆత్మను సైతం స్థిరమైనదిగా చూడాలి. అలాగే మన ఆత్మలో ప్రాణులన్నింటిని లౌకికాలుగా చూడగలగాలి. అప్పుడు కానీ మన జీవాత్మకు పరమాత్మ సత్యతత్వం అర్థంకాదు. జితాత్మలకే పరమాత్మ అనంతత్వం అంది వచ్చేది.
మనం జీవాత్మలం కాబట్టి ప్రాపంచికంగా ప్రతీదాన్నీ భిన్నంగానే చూస్తాం. కాని పరమాత్మకు సృష్టిలోని ఏ అంశా భిన్నం కాదు. పరమాత్మ స్వంతమైన ఈ అభిన్న భావాన్ని మన జీవాత్మ సాధించగలగటమే ధ్యానయోగ సాధన. అద్వితీయ ద్రష్టత్వమే గిక జీవనం. అంటే వనలోని సకల ప్రాణికోటిలోని ఆత్మతత్వం ఒక్కటే అన్న భావన. మనలో స్థితం కావాలి. అప్పుడే ఆత్మది అద్వితీయ తత్వవౌతుంది. సృష్టి అంతా నిజానికి అద్వితీయతనే. కానీ మనం దృశ్యంగా భిన్నత్వాన్ని చూస్తుంటాం. భిన్నత్వాలను తొలగించుకో గలగటమే యోగ సాధన. ఈ సాధనతో సకల ప్రాణికోటి ‘ఏక’ రూపంగా సాక్షాత్కరిస్తుంది. చరాచర సృష్టి సంపదను ‘ఏకాత్మ’గా చూడటం జరుగుతుంది. అంటే సర్వప్రాణులూ ఆత్మ అంశలే. ఇలా భౌతిక దృశ్యాలన్నీ అదృశ్యం కావటమే అధిభౌతిక దర్శనం.
ఈ అభేదత్వాన్ని, అభిన్నత్వాన్ని ఎరుక పరచటానికే కృష్ణుడు
‘యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి’ అని అంటాడు. ప్రాణికోటిలో ఆత్మ రూపంగా ఉన్న తనను చూడటం పరమ పురుష లక్షణం అని అంటాడు. సృష్టిలోని ప్రతి అంశలోను అంతర్గతంగా తనను చూడగలిగితే తాను అదృశ్యుడ్ని కానని అంటాడు. అంతేకాక అటువంటి వారు తనకూ అదృశ్యులు కారని అంటాడు. అంటే భౌతిక దృశ్యాదృశ్యాలన్నీ ‘ఏకం’ కావటమే ‘ఒన్‌నెస్’!
ఈ ‘పర-ఆత్మ’ తత్వాన్ని ఆకళింపు చేసుకుని, అందుకోవటానికి చేసే సాధనే కర్మయోగం. సర్వ భూతాత్మక ఆత్మను ‘పరమ-ఆత్మ’గా పరిగణించి, భజించటం భక్తియోగం. ప్రాపంచికంగా వ్యవహరిస్తూ ఆ పరమాత్మనే మన వర్తనానికి మూలంగా పరిగణించి జీవిస్తుండటం జ్ఞానయోగం. మొత్తానికి భక్తి - జ్ఞాన - కర్మ యోగ సాధనలతో పరమ శ్రేష్ఠ కావటం, సహజీవుల - ప్రాణుల కష్ట సుఖాలను మన కష్టసుఖాలుగా పరిగణించి జీవించటమే గిక జీవనం. ఈ సవభావ స్థితే స్థిరస్థితి.

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946