క్రైమ్/లీగల్

రైలు ఢీకొట్టిన ప్రమాదంలో కుడి కాలు కోల్పోయిన విద్యార్థిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, అక్టోబర్ 6: రైల్వే ట్రాక్ దాటి బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తున్న మొల్లి చాందిని (12) అనే విద్యార్థిని గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ సంఘటనలో చాందిని కుడికాలు కోల్పోయింది. ఈ సంఘటన శనివారం ఉదయం అగనంపూడి శివారు దిబ్బపాలెం వద్ద చోటు చేసుకుంది. దీనికి సంబంధించి దువ్వాడ పోలీసులు అందించిన వివరాలిలావున్నాయి. దిబ్బపాలెం గ్రామానికి చెందిన చాందిని శనివారం ఉదయం బహిర్భూమికి అని సమీపంలో రైల్వే ట్రాక్ దాటిన తరువాత ఉన్న పొదల్లోకి వెళ్లింది. తిరిగి వస్తూ రైల్వే ట్రాక్ దాటుతుండగా ఎన్టీపీసీకి బొగ్గును తీసుకు వెళ్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చాందిని పక్కన పడింది. కానీ కుడి కాలు ట్రాక్‌పై ఉండి పోవడం రెండు ముక్కులు అయి పోయింది. ఈ తరుణంలో స్థానికులు వెనువెంటనే చికిత్స నిమిత్తం విశాఖపట్నం కేజిహెచ్‌కు తరలించారు. అయితే చాందిన తల్లిదండ్రులు రమణ, రమణమ్మలు రోజువారి కూలీ చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. చాందిని అగనంపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతుంది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాపీమేస్ర్తి మృతి
భీమునిపట్నం, అక్టోబర్ 6: స్థానిక తగరపువలస పెట్రోల్‌బంక్ సమీపంలో ఓ తాపీ మేస్ర్తీ మృతిచెందివుండడాన్ని శనివారం సాయింత్రం పోలీసులు కనుగొన్నారు. వివరాల్లోకి వెల్తె జిల్లాలో చోడవరం వద్ద చీడిపల్లికి చెందిన కొమ్మనాపల్లి చంద్రరావు(38) వృత్తిరీత్యా తాపీపనులు చేస్తుంటాడు. ఇతనికి నార్య దేవి, కుమరుడు గౌతం, కుమార్తె ఇందు కలరు. అయితే ఉపాది నిమిత్తం రెండున్నరేళ్ల క్రితం తగరపువలస వచ్చి మార్కెట్ సమీపంలో నివాసముంటున్నాడు. శనివారం ఇంటి నుండి బయలుదేరిన చంద్రరావు పెట్రోల్ బంకు వద్ద శనివారం మధ్యాహ్నం మృతిచెంది ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసునమోదు చేసారు. కాగా చంద్రరావు మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు.