ఆంధ్రప్రదేశ్‌

నాన్న హత్యపై దుష్ప్రచారం తగదు:వివేక కుమార్తె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల: నాన్న మృతి తమను ఎంతో కృంగదీసిందని వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత అన్నారు. ఆమె ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ తండ్రిని దారుణంగా హత్యచేశారని అన్నారు. అధికార పార్టీ పెద్దలు, మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె ఆవేదన వ్యక్తంచేస్తూ సంయమనం పాటించాలని కోరారు. సీఎం చంద్రబాబు ప్రతి బహిరంగ సభలో సొంత కుటింబీకులే వివేకాను హత్యచేశారని చెబుతున్నారని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఈ హత్యపై దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటుచేశారని, అది నిష్పక్షిపాతంగా విచారణ జరపాలని, ఇటువంటి సమయంలో అధికార పార్టీ పెద్దలు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏమిటని ఆమె మండిపడ్డారు. తమది 700 మంది సభ్యులు ఉన్న పెద్ద కుటుంబం అని చిన్న చిన్న భేదాభిప్రాయలు ఉంటాయే తప్ప ఒకరినొకరం చంపుకునే విధంగా లేమని అన్నారు. మాది చాలా మంచి కుటుంబం అని అన్నారు. తమ తల్లి ఆరోగ్యం బాగుండకపోవటంతో హైదరాబాద్‌లో తన వద్ద ఉంటుందని, నాన్న ఒక్కరే పులివెందులలో ఉంటున్నారని చెప్పారు. ఆయనకు ప్రజాసేవ ముఖ్యమని, ఆ తరువాతే కుటుంబం అని అన్నారు. జగన్ అన్నను సీఎంగా చూడాలని ఆరాటపడ్డారని, అందుకోసం కృషిచేస్తున్నారని తెలిపారు. పోలీసు విచారణ సక్రమంగా జరిగేలా చూడాలని కోరుతున్నానని, ప్రత్యేక దర్యాప్తు బృందం తన పని తాను చేసుకుపోయేలా వ్యవహరించాలని ఆమె కోరారు.