కృష్ణ

స్మార్ట్‌సిటీ అభివృద్ధిలో రష్యా సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 4: నగరంలో చేపట్టనున్న స్మార్ట్ సిటీ అభివృద్ధికి రష్యా సహకారం ఉంటుందని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం గ్లోబల్ వాటర్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రష్యా ప్రతినిధి బృందం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో కలిసి నగరంలో చేపట్టబోయే ఆయా పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన వారు నగరం స్థితిగతులపై సమగ్ర సర్వే చేపట్టి భవిష్యత్తులో పెరగనున్న జనాభాను సైతం దృష్టిలో పెట్టుకొని వివిధ ప్రాజెక్టులను రూపొందించడం జరిగిందని కమిషనర్ వీరాపాండియన్‌కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజల కోసం నగరంలో ఇప్పటికే పలు అభివృద్ధి పథకాలను అమలుచేస్తున్నామని, వీటిలో భాగంగా నగరంలో ప్రవహించే నదీకాల్వ గట్ల సుందరీకరణ, రోడ్ల విస్తరణ, కొండ ప్రాంతాల అభివృద్ధి తోపాటు ప్రజలకు అందిస్తున్న వౌలిక సదుపాయాలను సమగ్ర నివేదిక అందించాలని బృంద సభ్యులకు సూచిస్తూ ఇందుకు రష్యా ప్రతినిధులకు అవసరమైన సమాచారం నిమిత్తం సహకారాలివ్వాలని విఎంసి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రష్యా ప్రతినిధి ఆన్‌ట్రయి గ్రినివ్, గ్లోబల్ వాటర్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సొల్యూషన్స్ ప్రతినిధి ఫణీంద్రనాథ్, విఎంసి ఎస్‌ఇ ఆదిశేషు, ఇఇ గోవిందరావు, అర్బన్ ప్లానర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.