కృష్ణ

అక్రమాలకు పాల్పడే గ్యాస్ డీలర్లపై కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 27: దీపం గ్యాస్ కనెక్షన్లకు అధిక ధరలు వసూలు చేసినా, గ్యాస్ పంపిణీలో అవకతవకలకు పాల్పడే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మంగళవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్‌పి గ్యాస్‌కు చెందిన స్థానిక ఫకీర్‌గూడెం, మాధవ్ ఎంటర్‌ప్రైజెస్, పటమట లలితాదేవి గ్యాస్ ఎజెన్సీలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో గృహ ఉపయోగ, వాణిజ్య అవసరాల గ్యాస్ సిలిండర్లలో ఉండవలసిన దానికన్నా తక్కువ గ్యాస్ ఉండటంతో సంబంధిత గ్యాస్ కంపెనీపై కేసు నమోదు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా గ్యాస్ ఏజెన్సీలు, గ్యాస్ డీలర్లపై పెద్దఎత్తున ఆరోపణలు, వినియోగదారుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై ఆకస్మిక తనిఖీ నిర్వహించి లోపాలు ఉన్నట్లయితే కేసు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం దీపం, గ్యాస్ కనెక్షన్లను ప్రతిష్ఠాత్మకంగా పంపిణీ చేస్తున్నామని, దీనికై బడ్జెట్‌లో 350 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. గ్యాస్ ఏజెన్సీలు, ఈజి గ్యాస్ కార్డు పేరుతో 20 రూపాయలు వసూలు చేయడం, తద్వారా వినియోగదారులపై భారం పడుతోందని, వీటిని ఉచితంగా అందించాలని పౌర సరఫరా శాఖ అధికారులు, గ్యాస్ ఏజెన్సీలను ఆదేశించామన్నారు. ప్రతి నెల సబ్సిడీ వినియోగదారుల ఖాతాలకు నేరుగా జమ అవుతున్నందున ఈజి గ్యాస్ కార్డులు అవసరం లేదని మంత్రి అన్నారు. గ్యాస్‌ను సరఫరా చేసే డెలివరి బాయ్స్ వినియోగదారుల నుండి బలవంతపు వసూళ్లు చేయరాదని, ఫిర్యాదు వస్తే గ్యాస్ ఎజెన్సీలపై చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. వంట గ్యాస్‌కు సంబంధించి వినియోగదారులు తమ ఫిర్యాదులను టోల్‌ప్రీ నెం 1100కు చేయవచ్చని, వీటిపై పౌరసరఫరాల అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని మంత్రి అన్నారు. ప్రజల్లో చైతన్యం వస్తే అక్రమాలను అరికట్టేందుకు వీలుంటుందన్నారు. పెప్సీ, కోకోకోలా వంటి కంపెనీలు సెలెక్ట్ ఛానల్ పేరిట అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుపై మంత్రి స్పందిస్తూ సెలెక్ట్ ఛానళ్లను నిషేధించామని, న్యాయ సలహా తీసుకుని కేసు నమోదు చేస్తామన్నారు. లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ డాక్టర్ సుందర్ కుమార్ దాస్ మాట్లాడుతూ కమర్షియల్, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల తూకాన్ని తనిఖీలు చేస్తున్నామని, అవకతవకలకు పాల్పడే ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆకస్మిక తనిఖీలో మంత్రితో పాటు లీగల్ మెట్రాలజీ డెప్యూటీ కంట్రోలర్ రామ్‌కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి నాగేశ్వరరావు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిటి పి.వైకుంఠరావు, తదితరులు పాల్గొన్నారు.