కృష్ణ

సమ్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్ష ఫలితాలు.. ఇక అంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 9: రాష్ట్రంలో పాఠశాల విద్యలో సంస్కరణలు, టెక్నాలజీ వినియోగం గురించి అధికార యంత్రాంగం తరచూ చెబుతూ ఉంటుంది. కానీ విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో సరైన ప్రణాళిక లేకుండా హడావుడిగా తీసుకుంటున్న నిర్ణయాలతో విద్యార్థులు, తల్లితండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల విద్యను ప్రయోగాలకు వేదికగా మార్చివేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. గత విద్యా సంవత్సరం సీసీఈలో భాగంగా సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలను ప్రవేశపెట్టారు. గతంలోని త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక పరీక్షల స్థానంలో వీటిని ప్రవేశపెట్టారు. తొలుత మూడు పరీక్షలను నిర్వహించేందుకు నిర్ణయించినప్పటికీ, తరువాత వీటి సంఖ్యను రెండుకు కుదించారు. దీంతో రెండు సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు రాస్తే, తరువాతి తరగతికి ప్రమోట్ చేస్తారు. ఈ మేరకు గత ఏడాది ఆరు నుంచి 10వ తరగతి వరకూ సమ్మెటివ్ అసెస్‌మెంట్ -1ను సెప్టెంబర్‌లో నిర్వహించారు. అయితే ఈ పరీక్షలు జరుగుతున్న సమయంలో ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు ప్రచారం జరుగడంతో ఆ పరీక్షలన్నింటినీ రద్దు చేశారు. మరల పరీక్షను డిసెంబర్‌లో నిర్వహించారు. 8,9 తరగతులకు సంబంధించి సమ్మేటివ్ అసెస్‌మెంట్‌ను మల్టిపుల్ చాయిస్‌లో ప్రశ్నపత్రం రూపొందించారు. జవాబులు ఓఎమ్మార్ షీట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. సాధారణ పరీక్షలకు భిన్నంగా ఓఎమ్మార్ షీట్‌లో జవాబులను నమోదు చేసేలా పరీక్షను నిర్వహించడం గమనార్హం. దీంతో ఆ పరీక్ష ఫలితాలు త్వరగా వెలువడే వీలు ఉంది. కానీ విద్యార్థుల వివరాలు, వాల్యుయేషన్ చేసేందుకు అప్పగించిన సంస్థ వద్ద ఉన్న డేటాతో సరిపోలకపోవడం తదితర కారణాల వల్ల నేటికీ ఆ పరీక్ష ఫలితాలు వెల్లడించలేదు. సమ్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్ష ఫలితాల విడుదల్లో జాప్యం అవుతుండటంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో వార్షిక పరీక్షలను గతంలో మాదిరిగా నిర్వహించి, తరువాతి తరగతులకు ప్రమోట్ చేశారు. పరీక్ష నిర్వహించి దాదాపు ఏడు నెలలు కావస్తున్నా, ఫలితాలు ప్రకటించలేని స్థితి పాఠశాల విద్య శాఖలో ఉంది. మున్పిపల్ పాఠశాలల్లోని 8, 9 తరగతులకు ఇంగ్లీషు మీడియంలో మాత్రమే తరగతులు నిర్వహిస్తుండటంతో, విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని మల్టిపుల్ చాయిస్ తరహాలో ప్రశ్నపత్రం రూపొందించారు. విద్యార్థుల ప్రతిభను మదించడం కన్నా, మొక్కుబడిగా పరీక్ష నిర్వహించడానికే ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఇక ఆ పరీక్ష ఫలితాలు వచ్చే అవకాశం లేదని చెప్పవచ్చు.

ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనుల పరిశీలన
ఇంద్రకీలాద్రి, జూలై 9: ఇంద్రకీలాద్రిపై కొలువైన మల్లిఖార్జున స్వామి సన్నిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను దేవస్థానం కమిటీ చైర్మన్ వీ గౌరంగబాబు సోమవారం ఉదయం పరిశీలించారు. స్వామి సన్నిధిలో ఏర్పాటు చేసిన గ్రీనరీ, కృత్రిమ ఆవు, దూడ బొమ్మలను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు.

పదోన్నతి పొందిన పోలీసు అధికారికి సన్మానం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూలై 9: జిల్లా పోలీసు క్రీడా విభాగంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తూ పదోన్నతిపై కాకినాడ 3వ పటాలం ఎపీయస్‌పికు బదిలీ అయిన బి విజయ్ కుమార్‌ను సోమవారం జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఘనంగా సన్మానించారు. ఐదేళ్లుగా విజయ్ కుమార్ అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ సోమంచి సాయికృష్ణ, డీఎస్పీ మహబూబ్ బాషా, ఎఓ మూర్తి, ఎ సెక్షన్ సూపరింటెండెంట్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.