క్రైమ్/లీగల్

మాజీ మేయర్ పంచుమర్తి ఇంట్లో చోరీ కేసులో మహిళతో సహా ఇద్దరు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 24: అధికార పార్టీకి చెందిన మాజీ మేయర్ ఇంట్లో చోరీకి పాల్పడిన మహిళతో సహా మరో వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.2.90లక్షలు విలువైన 10గ్రాముల బంగారం, 6.500 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లోని మహిళ గతంలో మాజీ మేయర్ ఇంట్లో పని చేసి మానేసిన క్రమంలో చోరీకి పాల్పడటం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెనమలూరు పోలీసుస్టేషన్ పరిధిలోని మురళీనగర్‌కు చెందిన 30ఏళ్ల మహిళ, 25ఏళ్ల యువకునితో కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకుని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటోంది. ఆ మహిళ కానూరు వంద అడుగుల రోడ్డులో నివాసముంటున్న నగర మాజీ మేయర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఇంట్లో గతంలో పని చేసి మానేసింది. ఆ తర్వాత తన ప్రియునితో కలిసి మాజీ మేయర్ ఇంట్లో చోరీకి పథకం రచించింది. గతంలో ఇంట్లో పని చేసిన అనుభవం ఉన్నందున ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో ఆమెకు తెలియడంతో పని సులువైంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 19న, ఆగస్టు 7న రెండుసార్లు చోరీకి పాల్పడింది. ప్రియునితో కలిసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి వెనుకవైపు ఉన్న గోడ ఎక్కి బంగారం, వెండి చోరీకి పాల్పడింది. ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేయగా దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు మహిళతోపాటు ప్రియుడిని అరెస్టు చేసి చోరీ సొత్తు రికవరీ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండుకు తరలించారు.

సీఆర్‌డీఏ ఓపెన్ ఫోరంలో
7 దరఖాస్తులకు అనుమతులు
విజయవాడ (ఎడ్యుకేషన్), ఆగస్టు 24: ఏపీ సీఆర్‌డీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఓపెన్ ఫోరంలో భవనాలు, లేఅవుట్ల దరఖాస్తులను ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ స్వయంగా పరిశీలించి అన్ని నిబంధనలు పాటించిన వారికి అప్పటికప్పుడే ప్రాథమిక అనుమతి మంజూరు చేశారు. ఓపెన్ ఫోరంలో 9 దరఖాస్తులు రాగా నిబంధనలకు అనుగుణంగా ఉన్న 7 దరఖాస్తులను ఆమోదించి ప్రాథమిక అనుమతి మంజూరు చేశారు. మరో 2 దరఖాస్తులను అదనపు సమాచారం కోరారు. లేఅవుట్ల అనుమతి కోసం 4 దరఖాస్తులు రాగా 3 దరఖాస్తులను క్లియర్ చేసి, మరో దరఖాస్తుకు అదనపు సమాచారం కోరారు. ఎన్‌ఓసీ కోసం ఒక దరఖాస్తు చేసుకోగా దానిని ఆమోదించారు. రిలీజ్ ఆఫ్ మార్టిగేజ్ ఏరియా మరియు ఫైనల్ లేఅవుట్ అనుమతి కోసం ఒక దరఖాస్తు రాగా అన్ని పత్రాలు సక్రమంగా ఉండటంతో ఆమోదించారు. రిలీజ్ ఆఫ్ మార్టిగేజ్ ఏరియా, ఆక్యుపెన్సీ సర్ట్ఫికేట్ కోసం 3 దరఖాస్తులు రాగా 2దరఖాస్తులను ఆమోదించారు. మరో దరఖాస్తుకు అదనపు సమాచారం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ సగిలి షణ్మోహన్, డెవలప్‌మెంట్ ప్రమోషన్ విభాగం జాయింట్ డైరెక్టర్లు కె ధనుంజయరెడ్డి, బాలాజీ, అధికారులు పాల్గొన్నారు.