క్రైమ్/లీగల్

బ్లేడ్‌బ్యాచ్ సభ్యుడి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, అక్టోబర్ 7: మద్యం మత్తులో వీరంగం సృష్టించి కానిస్టేబుల్‌పై సైతం దాడి చేసిన కేసులో నిందితుడు బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు దేవరకొండ నాగరాజు (23) ఆదివారం సాయంత్రం భవానీపురం పోలీసు స్టేషన్‌లో బ్లేడ్‌తో పీక, పొట్ట భాగంలో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం గతంలో నగరంలోని పలు పోలీసుస్టేషన్‌లలో పలు కేసుల్లో కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న దేవరకొండ నాగరాజు రెండు రోజుల క్రితం సితార సెంటర్‌లో దుర్గావైన్స్ వద్ద తన అనుచరులతో ఓ వ్యక్తిని గాయపర్చటం, అనంతరం సితార సెంటర్‌లో రాత్రిపూట కొత్తపేటకు చెందిన సొగాని హరీష్‌బాబు (27) కానిస్టేబుల్‌పై దౌర్జన్యం చేసిన విషయం విదితమే.
కాగా ఆ కేసులో నిందితుడిని భవానీపురం పోలీసులు అదుపులోకి తీసుకుని కటకటాల్లో ఉంచారు. కోర్టుకు ప్రవేశపెట్టడానికి కావాల్సిన రికార్డులు తయారు చేస్తున్న సమయంలో నాగరాజు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. విషయం గమనించిన పోలీసులు హుటాహుటిన బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. జరిగిన సంఘటనలో బాధితుడు ప్రాణాప్రాయ స్థితి నుంచి బయపడ్డాడని సిఐ మోహన్‌రెడ్డి తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
చిలకలూరిపేట, అక్టోబర్ 7: మండల పరిధిలోని జాతీయ రహదారిపై లక్కీ రోడ్‌లైన్స్ ఎదురుగా ఒంగోలు నుండి విజయవాడ వెళ్తున్న ఇన్నోవా కారు లారీని ఓవర్‌టేక్ చేయబోయి అదుపుతప్పి 30 అడుగుల దూరంలో పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విజయవాడ మొగల్‌రాజ్‌పురానికి చెందిన అరవపల్లి కరుణకుమార్, పోరంకికి చెందిన మురళీబాబు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన ఐదుగురు స్నేహితులు ఆదివారం సెలవుదినం కావడంతో ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో ఉన్న శనేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించేందుకు బయలుదేరారు. వారు అనుకున్న విధంగానే ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రమాణమయ్యారు. అనుకోని విధంగా ఈ ప్రమాదం సంభవించడంతో ఇద్దరూ మృతిచెందగా, ముగ్గురు తీవ్ర గాయాలపాలై చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. రూరల్ ఎస్‌ఐ ఉదయబాబు, ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.