క్రైమ్/లీగల్

మహిళ హత్య, దోపిడీ కేసులో నిందితురాలి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 22: మహిళను హత్య చేసి దోపిడీకి పాల్పడిన కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి సుమారు రెండున్నర లక్షలు విలువైన 84గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు క్రైం డీసీపీ బీ రాజకుమారి తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అజిత్‌సింగ్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలోని న్యూ రాజరాజేశ్వరీపేట రోడ్డు ఫార్చున్ హైట్స్ అపార్ట్‌మెంట్ ప్లాట్ నెంబర్ 305లో ఒంటరిగా ఉన్న పేరం నాగమణి (57) అనే మహిళను ఈ ఏడాది మార్చి 24న గుర్తుతెలీని వ్యక్తులు హత్యచేసి ఒంటిపై నగలు దోచుకెళ్లారు. ఈఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు, సీసీఎస్ బృందాలు దర్యాప్తు చేపట్టిన మీదట నిందితురాలిని గుర్తించి మహ్మద్ ఆసియా బేగం అలియాస్ బేగం (46)ని అరెస్టు చేశారు. హత్యకు గురైన మహిళ పెద్ద కుమారుడు పేరం కల్యాణరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు అధికారులు రంగంలోకి దిగారు. హతురాలి భర్త కోటిరెడ్డి మూడేళ్ల క్రితం మరణించాడు. పిల్లలు నలుగురికి వివాహాలై దూరంగా ఉంటున్నారు. దీంతో ప్లాట్‌లో ఒంటరిగా ఉంటున్న నాగమణిపై ఇంటి ఎదురుగా ఫ్లాట్ 306లో ఉంటున్న ఆసియా బేగం కన్ను పడింది. గత పిబ్రవరిలో అద్దెకు దిగిన బేగం మెల్లగా నాగమణితో పరిచయం పెంచుకుని దగ్గరైంది. బేగం తన భర్త మధ్య కొనసాగుతున్న కుటుంబ తగాదాల వ్యవహారానికి సంబంధించి ప్రస్తావన రావడంతో నాగమణి వ్యాఖ్యలకు ఆగ్రోహితురాలైన బేగం నాగమణి జుట్టు పట్టుకుని గోడకు కొట్టడంతో తలకు గాయమైన స్పృహ తప్పి పడిపోయింది. దీంతో చనిపోయిన నాగమణి మృతదేహాన్ని ఆమె ఫ్లాటుకు ఈడ్చుకెళ్లి తలుపు పక్కన పడేసింది. కాగా ఆమె ఒంటిపై ఉన్న నాలుగు బంగారు గాజులు, ఒక గొలుసు, రెండు పేటల మరో గొలుసు, సుమారు రెండున్నర లక్షల విలువైన 84 గ్రాముల బంగారు నగలు దోచుకుంది. ఈ కేసులో నిందితురాలిని అరెస్టు చేసి సొత్తు రివకరీ చేసినట్లు డీసీపీ తెలిపారు. విలేఖరుల సమావేశంలో ఏసీపీ పీ సుందరరాజు, సీఐ బాల మురళీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.