విజయవాడ

అమెరికాలోని ఏపీ విద్యార్థులను స్వస్థలాలకు రప్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 13: దేశం కాని దేశం అమెరికాలో గడచిన నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పడుతున్న కష్టాలను ఇప్పటికైనా గుర్తించి స్వస్థాలకు రప్పించే విషయంలో తక్షణం దృష్టి నిలపాలని కోరుతూ టీడీపీఎన్‌ఆర్‌ఐ విభాగం కార్యదర్శి పారిశ్రామికవేత్త కె బుచ్చిరాంప్రసాద్ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కరోనా సృష్టిస్తున్న ప్రళయాన్ని కళ్లారా చూస్తున్నామంటూ, ఈ విపత్కర సమయంలో మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, ఉద్యోగులను రక్షించడంలో, వారికి సదుపాయాలు కల్పించడంలోనూ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. విద్యార్థులంటే మన రాష్ట్ర సంపంద, మన ఆస్తి అని, అలాంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. దాదాపు 5లక్షల మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విదేశాలకు వెళ్ళి విద్యనభ్యసిస్తున్నారని, అయితే కరోనా ప్రళయం మొదలైన వెంటనే తమ తమ స్వస్థాలాలకు చేరుకోటానికి అత్యధిక మంది టిక్కెట్లు రిజర్వు చేకున్నారన్నారు. విమాన సర్వీస్‌లు రద్దు, లాక్‌డౌన్ వంటి అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని వివరించారు.