కృష్ణ

చిచ్చు రాజేసిన బొజ్జ గణపయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 2: ఒకప్పటి మిత్రులు.. వ్యాపార భాగస్వాములు అయిన ప్రస్తుత శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ మధ్య కొంతకాలంగా సాగుతున్న కోల్డ్ వార్‌కు ఘంటసాల ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో ఏర్పాటైన 72 అడుగుల వినాయక విగ్రహం ప్రాంగణం వేదికగా మారుతోంది. అసలు ఈ భారీ వినాయక విగ్రహ ప్రతిష్టకు శ్రీకారం చుట్టిన డూండీ సేవా సమితికి ఆరంభం నుంచి గౌరవాధ్యక్షునిగా కొనసాగుతూ వచ్చిన కోగంటి సత్యంతో పాటు 10 శాతం మంది సభ్యుల్ని తొలగించారు. రెండు రోజుల క్రితం జరిగిన సమితి సమావేశంలో కోగంటి స్థానంలో ఎమ్మెల్యే బొండా గౌరవాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో రాత్రి పగలు విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. వీటిని పర్యవేక్షించే నిమిత్తం ఎమ్మెల్యే బొండా సాయంత్రం ప్రాంగణానికి వచ్చి మీడియాతో మాట్లాడారు. కోగంటి తొలగింపుపై మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో తన ఎన్నిక జరిగిందంటూ, సమితి నుంచి బహిష్కృతులైన వారు సామాన్య భక్తుల్లా వచ్చి స్వామిని దర్శించుకు వెళ్లవచ్చన్నారు. రౌడీయిజం చేస్తానంటే చూస్తూ ఊరుకోబోమంటూ పరోక్షంగా కోగంటిని హెచ్చరించారు. దేశంలోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఉత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ ఉత్సవాల్లో ఎవరైనా అల్లరి చేస్తే వారిని అరెస్ట్ చేయిస్తామని, క్రిమినల్ కేసులు బనాయింప చేస్తామని హెచ్చరించారు. సమాచారం తెలుసుకున్న కోగంటి ఆగమేఘాలపై అక్కడకు చేరుకుని మీడియా ఎదుట బొండాపై నిప్పులు చెరిగారు. తమ ఇద్దరిలో ఎవరు రౌడీయో, ఎవరు ఎలాంటివారో అందరికీ తెలుసన్నారు. ఉద్దేశపూర్వకంగా తనపై కొన్ని కేసులు బనాయింప చేశారన్నారు. సాధారణ స్థితిలో ఉన్న బొండాను తాను చేరదీసి వ్యాపార భాగస్వామ్యం కల్పించానని, రాజకీయాలు వద్దని చెప్పినా వినకుండా తన వాటా విక్రయించి వెలుపలికి వెళ్లి తనపై కక్ష బూనారన్నారు. పరోక్షంగా ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. అక్కడ పరిస్థితి వేడెక్కటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అందరినీ వెలుపలికి పంపించారు.