రాష్ట్రీయం

ఖైదీలకు ఉన్నత విద్య అందిస్తున్నాం.. వృత్తి శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ జైళ్ల శాఖ డిజి వికె సింగ్
హైదరాబాద్, నవంబర్ 30: జైళ్లలో మహాపరివర్తన్ పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే ఖైదీలకు ఉన్నత విద్యను అందిస్తున్నామని తెలంగాణ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ వికె సింగ్ తెలిపారు. సోమవారం చంచల్‌గూడ జైలులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల ఆసక్తి మేరకు వృత్తివిద్య శిక్షణ ఇప్పిస్తున్నామని, ఉన్నత విద్య అభ్యసించేందుకు అవకాశం కల్పించామన్నారు. మహాపరివర్తన్ కార్యక్రమం ద్వారా ఖైదీలలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, రాష్టవ్య్రాప్తంగా వివిధ నేరాల కింద పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 36,887మంది ఖైదీలకు ఉన్నత విద్యను అందించామని డిజి వికె సింగ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు శిక్షకాలం పూర్తి చేసుకొని విడుదలైన 37మంది ఖైదీలకు ఉపాధి కల్పించామన్నారు. మారుమూల గ్రామాలను దత్తత తీసుకొని జైళ్ల నుంచి విడుదలై ఖైదీలతో స్వచ్ఛ్భారత్ నిర్వహిస్తామని, దీంతో ఖైదీలలో పెనుమార్పు వస్తుందని భావిస్తున్నామని డిజి చెప్పారు.