ఆంధ్రప్రదేశ్‌

రెవెన్యూ ప్రక్షాళనకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 16: నవ్యాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో భూకబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించిన కబ్జాదారులకు సహకరిస్తూ రికార్డులను తారుమారు చేస్తూ తమవంతు సహకారం అందిస్తున్న రెవెన్యూ అధికారులు కోట్లు దండుకుంటున్నారు. దీనికి తోడు ప్రైవేటు భూములను తప్పుడు పత్రాలతో ఆక్రమించడం వంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటువంటి వారికి రెవెన్యూ అధికారులే పూర్తి సహకారం అందిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూ ఆక్రమణలు, కబ్జా వంటి సంఘటనల్లో అక్రమార్కుల పాత్రతో పాటు రెవెన్యూ అధికారులు అంతే పాత్ర పోషిస్తున్నారు. ఇక రెవెన్యూ పరంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారం, వంటి అంశాల నిమిత్తం కార్యాలయాలకు వస్తున్న ప్రజలు లంచం ఇస్తే గానీ పని జరగని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల విశాఖ రెవెన్యూ శాఖలో చోటుచేసుకున్న పరిస్థితులే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నెల రోజుల కాల వ్యవధిలో ముగ్గురు రెవెన్యూ అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి పట్టుబడిన తీరు రెవెన్యూ శాఖలో చోటుచేసుకుంటున్న అవినీతికి అద్దం పడుతోంది. భీమునిపట్నం తహశీల్దారు కార్యాలయ పరిధిలో పట్టాదార్ పాసుపుస్తకం నిమిత్తం రెవెన్యూ ఇనస్పెక్టర్, గ్రామ పరిపాలనాధికారి (విఆర్‌ఎ) కలిసి లంచం డిమాండ్ చేయగా విసుగు చెందిన యజమాని ఎసిబితో పట్టించాడు. అంతకు ముందు మునగపాక తహశీల్దారు కార్యాలయం పరిధిలో కూడా పట్టాదార్ పాసుపుస్తకం నిమిత్తం లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇనస్పెక్టర్‌ను ఎసిబి అధికారులు పట్టుకున్నారు. తాజాగా అచ్యుతాపురం మండల తహశీల్దారు, సర్వేయర్ భూ రికార్డుల నమోదుకు ఏకంగా రూ.7.5 లక్షలు డిమాండ్ చేసి, అడ్వాన్సుగా రూ.లక్ష తీసుకుంటూ ఎసిబికి చిక్కారు. ఇక్కడ విశేషమేమిటంటే లంచంగా డిమాండ్ చేసిన దాంట్లో కొంత మొత్తాన్ని చెక్కు రూపంలో తీసుకునేందుక తెగించారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడే అక్రమార్కులకు సహకారం చేసేందుకు కొంతమంది రెవెన్యూ అధికారులు ఏకంగా రికార్డులనే తారుమారు చేసేందుకు సైతం వెనుకాడట్లేదు. విశాఖ రూరల్ మండల పరిధిలో 15 ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించి రికార్డులను తారుమారు చేసి అక్రమార్కులకు సహకరించిన సంఘటన తాజాగా వెలుగు చూసింది. రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను వీరికి కట్టబెట్టేందుకు వీలుగా రికార్డులను మార్చిన సంఘటనపై కలెక్టర్ సీరియస్‌గానే స్పందించారు. రూరల్ తహశీల్దారు కార్యాలయం ఉప తహశీల్దారు ఆధ్వర్యంలో ఉండే రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారన్న అభియోగంపై డిప్యూటీ తహశీల్దారు, సహాయకుడుగా విధులు నిర్వహిస్తున్న విఆర్‌ఎను విధుల నుంచి తప్పించారు. ఎబిసికి పట్టుబడుతున్నా, సస్పెన్షన్ వేటు పడుతున్నప్పటికీ రెవెన్యూ అధికారుల్లో మాత్రం మార్పు రావట్లేదు. దీనిపై కలెక్టర్ ప్రవీణ్‌కుమర్ కాస్త సీరియస్‌గానే స్పందించారు. అవినీతికి దూరంగా ఉంటామంటూ అధికారులు, సిబ్బందితో ప్రమాణం చేయించారు. రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ ఫోన్ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఉన్నతాధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా లంచం తీసుకోకూడదన్న మానసిక పరివర్తన అధికారుల్లో వస్తే తప్ప పరిస్థితుల్లో మార్పు రాదన్నది వాస్తవం.