ఆంధ్రప్రదేశ్‌

అందరి దృష్టీ విశాఖపైనే! నేడు అధికార, విపక్ష నేతల రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 25: అందరి దృష్టి విశాఖ పైనే ఉంది. మొన్నటి వరకూ అంతగా పట్టించుకోని ప్రత్యేక హోదా ఉద్యమం ఒక్క సారిగా ఊపిరిపోసుకుంది. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమంతో అనుకున్నది సాధించుకున్న తమిళుల పోరాటపటిమను స్ఫూర్తిగా తీసుకుని ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని సమాయత్తం కావడం, దీనికి కొన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు పలకడంతో ఉద్యమం కొత్త రూపు సంతరించుకుంటోంది. హోదా ఉద్యమాన్ని ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉద్ధృతం చేయాలని అన్ని వర్గాలు భావించాయి. దీనిలో భాగంగానే ఆంధ్రా యువత పేరిట జనసేన ప్రతినిధులు ఆర్‌కె బీచ్ వేదికగా వౌన దీక్ష చేపట్టాలని, అదే రోజు సాయంత్రం వైకాపా ఆధ్వర్యంలో ఆర్‌కె బీచ్ నుంచి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించాయి. ఉద్యమంలో భాగంగా విశాఖలో గురువారం సాయంత్రం అర్‌కె బీచ్ వేదికగా జరిగే ప్రదర్శనలో తాను స్వయంగా పాల్గొంటానంటూ ప్రకటించారు. అయితే గణతంత్ర దినోత్సవం, అనంతరం రెండు రోజుల పాటు విశాఖ వేదికగా జరుగుతున్న రెండవ భాగస్వామ్య సదస్సు దృష్ట్యా ఎటువంటి ప్రదర్శనలు, ర్యాలీలు, సభలకు అనుమతి లేదంటూ పోలీసు యంత్రాంగం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక రెండు రోజుల పాటు విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి 8 గంటలకే విశాఖ చేరుకోనున్నారు. దీంతో ఒకే సమయంలో అధికార, విపక్ష నేతలిద్దరూ విశాఖలోనే గడపనున్నారు. మొత్తం మీద అందరి దృష్టి విశాఖ నగరంపైనే ఉందనేది వాస్తవం.