విజయనగరం

బిసిల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 11: రాష్ట్ర ప్రభుత్వం బిసిల సమగ్రాభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. జ్యోతిరావు పూలే 190వ జయంతి సందర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ కళ్యాణమండపంలో నిర్వహించిన జయంతి సభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు విద్యతోనే సమాజంలో సముచిత గౌరవం లభిస్తుందని ఆనాడే మహాత్మా జ్యోతిరావు పూలే గుర్తించారని అన్నారు. సమాజంలో అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా 8800కోట్ల రూపాయిలతో బిసి సబ్‌ప్లాన్‌ను బిసి సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.ఈనిధులను ఖర్చు చేయడానికి బిసిల మనోభావాలకు అనుగుణంగా ఎటువంటి కార్యక్రమాలు చేపడితే వృత్తిదారులు అభివృద్ధి చెందుతారో అభిప్రాయాలు సేకరించి బ్యాంకర్ల సహకారంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించే పనిలో ప్రభు త్వం ఉందని తెలిపారు. బిసిలకు రుణమంజూరులో జాప్యం లేకుండా చూస్తామని చెప్పారు. జిల్లా కేంద్రంలో బిసి భవన్ మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్ ఎం. ఎం.నాయక్ మాట్లాడుతూ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక ఉద్యమానికి ఆద్యుడు పూలే అని కొనియాడారు. ఆయన భార్య సావిత్రిబాయి పూలే కూడా మహిళావిద్య, వికాసానికి పాటుపడ్డారని తెలిపారు. వెనుకబడిన వర్గాలను ఆర్ధికంగా పైకి తీసుకువచ్చేందుకు మహానుభావుల స్ఫూర్తితోనే ప్రభుత్వాలు పధకాలను అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్ధులు విద్యలో రాణిస్తూ పోటీ పరీక్షల్లో విజయాలు నమోదుచేసి ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే ఆనాడు విద్య ఆవశ్యకతను పూలే గుర్తించడమేనని తెలిపారు. ఈసందర్భంగా బిసి సంఘం అధ్యక్షుడు ముద్దాడ మధు , ఉద్యోగుల సంఘం ప్రతినిధులు భాస్కరరావు, ప్రసాద్, బిసి సంఘం నాయకులు గొర్లె వెంకటరమణ, మజ్జి అప్పారావు ,విజయలక్ష్మి మాట్లాడుతూ బిసిలను ఆర్ధికంగా సామాజికంగా అభివృద్ధిలోనికి తీసుకురావడానికి ప్రభుత్వ పధకాలు అమలు చేయాలని రుణమంజూరులో బ్యాంకర్ల ఇబ్బందులు తొలిగించాలని కోరారు.బిసి భవన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈసందర్భంగా బిసి వృత్తిదారులకు మంజూరు చేసిన యూనిట్లను పరిశీలించి వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకుముందు కలెక్టరేట్ కూడలిలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి మంత్రి మృణాళిని , కలెక్టర్ ఎం. ఎం.నాయక్, ఏజిసి నాగేశ్వరరావు, జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి ,బిసిసంక్షేమాధికారి మనోరమ, బిసి సొసైటి ఇడి నాగరాణి, పలువురు బిసి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.