ఆంధ్రప్రదేశ్‌

హత్య కేసుల్లో డిఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (క్రైం), అక్టోబర్ 14: కంచే చేను మేసింది. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు మరో హత్యకు పథకం వేసిన పోలీసు అధికారి పాత్ర సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. వెరసి రెండు హత్యకేసుల్లో ప్రధాన నిందితునిగా తేలి, ప్రస్తుతం పరారీలో ఉన్న డిఎస్పీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. విశాఖ నగరం గాజువాకకు చెందిన కొప్పెర్ల సత్యనారాయణ రాజు (గేదెల రాజు) ఈ నెల 6న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యోదంతంపై విచారణ జరిపిన నగర పోలీసులు ప్రస్తుతం ఆర్టీసీ విజిలెన్స్ విభాగంలో డిఎస్పీగా పనిచేస్తున్న దాసరి రవిబాబు ప్రధాన నిందితునిగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రవిబాబుతో పాటు హత్యోదంతంలో పాలుపంచుకున్న మరో 11 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేయగా, ప్రధాన నిందితుడు రవిబాబు, కీలక పాత్రధారి స్థానికంగా వెలువడుతున్న ఒక పత్రికాధినేత భూపతిరాజు శ్రీనివాసరాజు, అతని కారు డ్రైవర్ కేశవరావు పరారీలో ఉన్నారు. మిగిలిన నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. సంచలనం కలిగించిన ఈ హత్య కేసులకు సంబంధించి విశాఖ నగర సంయుక్త పోలీసు కమిషనర్ డి నాగేంద్ర కుమార్ విశాఖలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుత డిఎస్పీ రవిబాబు యలమంచిలిలో సర్కిల్ ఇనస్పెక్టర్‌గా పనిచేస్తున్న కాలంలో పాయకరావుపేటకు చెందిన పద్మలతతో పరిచయమైంది. ఈ పరిచయం వారి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. రవిబాబుకు అక్కడ నుంచి బదిలీ కావడంతో వీరి మధ్య కొంత ఎడబాటు వచ్చింది. ఇదే సందర్భంలో పద్మలత తనను వివాహం చేసుకోవాల్సిందిగా రవిబాబును డిమాండ్ చేస్తూ వచ్చింది. ఈ విషయాన్ని దాటవేస్తూ వచ్చిన రవిబాబు తీరుపై అనుమానంతో మార్చి 2016లో పద్మలత అప్పటి నగర పోలీసు కమిషనర్ అమిత్‌గార్గ్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెను అడ్డుతొలగించుకోవాలని భావించిన రవిబాబు, ప్రస్తుతం హత్యకు గురైన గేదెల రాజు సహకారం తీసుకున్నాడు. పద్మలతను అడ్డుతప్పించేందుకు గేదెల రాజుతో రూ.కోటికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనిలో తొలి విడతగా రూ.50 లక్షలు చెల్లించాడు కూడా. అయితే 2016 సెప్టెంబర్‌లో పద్మలత మృతి చెందింది. దీన్ని అనుమాన స్పద మృతిగా భావించినప్పటికీ సాధారణ మృతిగానే చిత్రీకరించి కేసు వెలుగుచూడకుండా చేశారన్న ఆరోపణలున్నాయి. పద్మలత మృతి అనంతరం గేదెల రాజు మిగిలిన మొత్తం కోసం తరచు పోలీసు అధికారి రవిబాబును బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఎలాగైనా గేదెల రాజును అడ్డుతొలగించుకోవాలని వ్యూహం పన్నాడు. ఇందుకు పత్రికాప్రతినిధి భూపతిరాజు శ్రీనివాసరాజు సహకారం తీసుకున్నాడు. పక్కా ప్రణాళికతో పత్రికా కార్యాలయంలోనే గేదెల రాజును హతమార్చి, మృతదేహాన్ని నగర శివారు సబ్బవరం తీసుకువెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారు. అయితే కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో డొంక కదిలింది. గేదెల రాజు హత్యలో పాలుపంచుకున్న ఇద్దరు రౌడీ షీటర్లు గుమ్మడి రవి, ఎస్ మహేష్‌లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మొత్తం కథ వెలుగులోకి వచ్చింది. గేదెల రాజును హతమార్చేందుకు రూ.4 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న కిరాయి హంతకులు పట్టబడ్డారు. వీరిచ్చిన సమాచారం మేరకు మిగిలిన నిందితులు ఎర్ని శ్రీనివాసరావు, ఆళ్ల గోపి, మైలపల్లి విజయ్ కుమార్, బంగా మురళి, కన్నం ఆనందకుమార్, పిల్లా త్రినాథ్, బెహరా కనకరాజును అదుపులోకి తీసుకుని విచారించగా, తాము పథకం ప్రకారం గేదెల రాజును హతమార్చినట్టు అంగీకరించారు. కేసులో ప్రధాన నిందితుడు, డిఎస్పీ రవిబాబు, కీలక నిందితుడు భూపతిరాజు శ్రీనివాసరాజు, డ్రైవర్ కేశవరావు పరారీలో ఉన్నారు. ఇదిలా ఉండగా 2016లో పద్మలత మృతిని సాధారణ మరణంగా భావించిన పోలీసులు ఇప్పుడు ఆకేసును సైతం తిరగదోడుతున్నారు. అలాగే సర్కిల్ ఇనస్పెక్టర్‌గా, ఎసిపిగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసిన సందర్భాల్లో రవిబాబు భూ వివాదాలు, సెటిల్‌మెంట్లకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. అప్పట్లో జరిగిన కొన్ని భూ ఆక్రమణ కేసులకు సంబంధించి ఫిర్యాదులను ఇప్పుడు వెలికితీస్తున్నారు. పోలీసు అధికారి రవిబాబు అధికార పార్టీకి చెందిన మంత్రితో అత్యంత సన్నిహితంగా మెరుగుతుండేవారు. ఇదే జిల్లాకు చెందిన మరో మంత్రి భూ వివాదాల్లో పోలీసుల సెటిల్‌మెంట్లపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.
చిత్రం.. గేదెలరాజు హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న విశాఖ సంయుక్త పోలీస్ కమిషనర్ డి.నాగేంద్రకుమార్