ఆంధ్రప్రదేశ్‌

బాణసంచా పేలి ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనందపురం (విశాఖ), ఆగస్టు 26: అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచా సామగ్రి పేలడంతో భార్యాభర్తలు దుర్మరణం పాలైన సంఘటన విశాఖ రూరల్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆనందపురం మండలం వేమగొట్టిపాలెంలో ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచా సామగ్రికి ప్రమాద వశాత్తు నిప్పంటుకుని అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో దాసరి అప్పన్న (45), దాసరి లక్ష్మి (35) సజీవ దహనమయ్యారు. నాలుగేళ్ల చిన్నారి విజయ ప్రమాదం జరగడానికి కొద్ది సేపటి ముందే ఆటలాడుకునేందుకు బయటకు వెళ్లడంతో ప్రాణాలు దక్కించుకుంది. అప్పన్న కుటుంబీకులు వివిధ ప్రాంతాల నుంచి బాణసంచా సామగ్రిని తెచ్చి పండుగలు, ఇతర కార్యక్రమాలకు విక్రయిస్తుంటారు. వినాయకచవితి పండుగను పురస్కరించుకుని పెద్ద ఎత్తున బాణసంచా సామగ్రిని ఇంట్లో నిల్వ చేశారు. 10 రోజుల కాల వ్యవధిలో విశాఖ రూరల్ జిల్లా పరిధిలో బాణసంచా పేలుడు దుర్ఘటన రెండోది. దేవరాపల్లి మండలం ఎ కొత్తపల్లిలో బాణసంచా తయారీ కేంద్రంలో ఈ నెల 17న పేలుడు చోటుచేసుకోగా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.