విజయనగరం

చంద్రబాబు ఓ నియంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, మార్చి 19: హైకోర్టు తీర్పు అమలు చేయడంలో చంద్రబాబు నియంతగా వ్యవహరిస్తున్నారని వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ఆరోపించారు. శనివారం ఇక్కడ జాతీయ రహదారి వద్ద రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జిలు ధరించి నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. రాజ్యాంగాన్ని గౌరవించలేదని, అలాగే కోర్టు తీర్పును అమలు పరచకుండా ఆదేశాలను దిక్కరించి నగర ఎమ్మల్యే రోజాను శాసనసభలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం శోచనీయమని అన్నారు.ఎమ్మెల్యేకు న్యాయం జరగనపుడు సామాన్యులకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. గడచిన ఎన్నికల్లో చేసిన వాగ్దానాలలో ఏ ఒక్కటి టిడిపి ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. రాజధాని నిర్మాణంలో భూసేకరణలో జరిగిన అవకతవకలపై సిబి ఐ విచారణ జరపాలని కోరినా పట్టించుకోలేదని చెప్పారు. అప్పలనర్సయ్య తన క్యాంపు కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కార్యకర్తలతో కలసి ప్రదర్శనగా చేరుకున్నారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బూడి వెంకటరావు, ఈదుబిల్లి కృష్ణ, కడుబండి రమేష్‌నాయుడు,వైకాపా నాయకులు దేవుడు నాయుడు, మంత్రి అప్పలనాయుడు, కరణం ఆదినారాయణ, బెల్లానత్రినాథరావు, మండల సురేష్ తదితరులు పాల్గొన్నారు.