విజయనగరం

హౌసింగ్ శాఖలో 80శాతం జియోట్యాగింగ్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామభద్రపురం, నవంబర్ 21: హౌసింగ్‌శాఖలో 80 శాతంపైబడి జియో ట్యాగింగ్ పూర్తయిందని, అక్రమాలు జరిగిన ప్రాంతాల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో తనిఖీ నిర్వహించి చర్యలు చేపడతామని రాష్ట్ర గృహ నిర్మాణశాఖామంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 2 లక్షల పక్కా గృహాలు నిర్మించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. శనివారం ఆమె రామభద్రపురం వచ్చిన సందర్భంగా నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. బలహీనవర్గాలు, పేదల సంక్షేమం దృష్ట్యా ఈ గృహాలను మంజూరు చేసినట్టు ఆమె తెలిపారు. అలాగే రాష్ట్రంలో లక్షా 19వేల గృహాలకు బిల్లులు అందించాల్సి ఉందని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 324 కోట్ల రూపాయలు విడుదల చేసిందని ఆమె తెలిపారు.
కరువు మండలంగా ప్రకటించాలి:
ఈ ఏడాది రామభద్రపురం మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రామభద్రపురం మండలాన్ని కరువుమండలంగా ప్రకటించాలని కోరుతూ మామిడివలస సర్పంచ్ ఆకుల చిన్నంనాయుడు మంత్రికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అప్పికొండ శ్రీరాములునాయుడు, టిడిపి నాయకులు చింతల రామకృష్ణ, బండారు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

వన భోజనాలలో విషాదం
మక్కువ/పార్వతీపురం, నవంబర్ 21: వనభోజనాలలో విషాదం చోటుచేసుకుంది. సరాదాగా స్నేహితులతో కలసి పిక్‌నిక్ వెళ్లిన ఇద్దరు బాలికలు నదిలో మునిగి మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీపురం మండలం బందులుప్పి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వతరగతి చదువుతున్న విద్యార్థినులు మక్కువ మండలం డి.శిర్లాం గ్రామంలో ఉన్న తోటలోకి కార్తీక మాసం సందర్భంగా శనివారం పిక్‌నిక్‌కు వెళ్లారు. జమ్మిడివలసకు చెందిన మూడడ్ల తులసి (12), జమదాలకు చెందిన కర్రి కవిత (12) సమీపంలో ఉన్న సువర్ణముఖి నదిలో స్నానాల కోసం దిగారు.