విజయనగరం

సెప్టెంబర్ 23 నుండి పైడిమాంబ దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(పూల్‌బాగ్), ఆగస్టు 30: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవంలో భాగంగా భక్తులు చేపట్టే పైడిమాంబ దీక్షలు సెప్టెంబర్ 23వతేదీన ప్రారంభమవుతాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి భానురాజా అన్నారు. మంగళవారం పైడితల్లి అమ్మవారి కల్యాణ మండపంలో పైడిమాంబ దీక్షల వివరాలను వెల్లడించారు. 23న చదురుగుడి వద్ద పైడిమాంబ మండల దీక్షలు అమ్మవారి సన్నిధిలో ప్రారంభమవుతాయని చెప్పారు. పైడిమాంబ దీక్షాధారుల పీఠం చదురుగుడి ఎదురుగా ఉన్న అన్నదాన ప్రసాదశాల వద్ద ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. కనకదుర్గమ్మవారి దీక్షలవలె పైడిమాంబ దీక్షలకు కూడా ప్రాచుర్యం కలిగించేందుకు పైడిమాంబ రథాన్ని ఏర్పాటుచేసి గ్రామాలలో పైడిమాంబ దీక్షల గురించి ప్రచారం చేస్తామని తెలిపారు. గురుస్వామి ఆర్.ఎస్.పాత్రో మాట్లాడుతు పైడిమాంబ దీక్షలు భక్తి, ముక్తిదాయకమని అన్నారు. మండల దీక్షలు చేయలేని వారు అర్థమండల దీక్షలు చేయవచ్చునని చెప్పారు. గత ఏడాది 350 మంది భక్తులు అమ్మవారి దీక్షాధారణ చేశారని, ఈ సంవత్సరం 500 మంది దీక్షలలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ప్రచార రథం ద్వారా దీక్షలకు విధి విధానాలను ప్రజలకు తెలియపరుస్తామని చెప్పారు. ఈ సమావేశంలో గురుస్వాములు ఎస్. అచ్చిరెడ్డి, ఉమ్మెత భాస్కరరావు పాల్గొన్నారు.