విజయనగరం

డిఎంఅండ్‌హెచ్‌ఓ సేవలు ప్రశంసనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (పూల్‌బాగ్), ఆగస్టు 30: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ శారద విధి నిర్వహణలో చేసిన సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర గృహనిర్మాణ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని అన్నారు. మంగళవారం ఆనందగజపతి ఆడిటోరియంలో మంత్రి వివిధ శాఖలపై సమీక్ష జరిపిన సందర్భంగా బుధవారం పదవీ విరమణ చేస్తున్న డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ శారదను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో పిహెచ్‌సి సేవలను మెరుగుపరచి రాష్టస్థ్రాయిలో మొదటి స్థానం జిల్లాకు దక్కటానికి కృషి చేసిన శారదను కొనియాడారు. పదవీ విరమణ అనంతరం వైద్యసేవలు అందించటం ద్వారా ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ శారద విధుల పట్ల అంకితభావం కలిగిన వ్యక్తిగా ప్రశంసించారు. వైద్యసేవలు ప్రజలకు అందించడంలో ఆమె విశేషంగా కృషిచేశారని అన్నారు. డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ శారద మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు తన విధులను చిత్తశుద్ధితో నిర్వహించానని, మంత్రి, కలెక్టర్ల సమక్షంలో తనకు జరిగిన సన్మానం జీవితంలో మరచిపోలేనన్నారు. పదవీ విరమణ అనంతరం పేదలకు వైద్యసేవలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఉషశ్రీ, జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సీతారామరాజు, ఎమ్మెల్యే డాక్టర్ కె.ఎ.నాయుడు, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, జడ్పీ వైస్‌చైర్మన్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.