విజయనగరం

భోగాపురం విమానాశ్రయ నిర్మాణం కోసం 160ఎకరాల భూమిని అప్పగించిన రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 30: రాష్ట్రప్రభుత్వం భోగాపురం మండలంలో నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ సజావుగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కౌలువాడ గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్‌ను కలుసుకుని వారికి సంబంధించిన 160ఎకరాల భూమిని అప్పగించేందుకు అంగీకార పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివేక్ మాట్లాడుతూ మొదటి దశలో 1362ఎకరాల ప్రైవేటు భూమికి డిక్లరేషన్ జారీచేశామని చెప్పారు. ఇప్పటివరకు 900 ఎకరాలు అప్పగించేందుకు రైతులు అంగీకార పత్రాలు అందజేశారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి సహకారం అందించడానికి ముందుకు వచ్చిన రైతులను కలెక్టర్ అభినందించారు. విమానాశ్రయ నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసిత రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని, తగిన నష్టపరిహారాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు అవసరమైన స్థలాలను గుర్తించామని తెలిపారు. జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో ముందుకు వచ్చి అంగీకార పత్రాలను అందించిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతుల భూములలో ఉన్న నిర్మాణాలు, చెట్లు, ఇతర ఆస్తుల వివరాలను సంబంధిత శాఖల ద్వారా సర్వే చేయించి వాటికి కూడా నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూములు అందించడానికి అంగీకార పత్రాలు అందజేసిన కొందరు రైతులు మాట్లాడుతూ భూములు కోల్పోవటంతో తాము నిర్వాసితులం అవుతున్నా విమానాశ్రయ నిర్మాణంతో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, వేలాదిమంది ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, సదుపాయాలు కలుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసమూర్తి, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బాలాత్రిపుర సుందరి, భోగాపురం తహశీల్దార్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.