విజయనగరం

జిల్లా పోలీసులను సన్మానించిన ఒడిశా పోలీసు అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 30: ఒడిశా రాష్ట్రంలో కార్మిక శాఖకు చెందిన ఇఎస్‌ఐ విభాగంలో కోట్లాది రూపాయల కుంభకోణంలో నిందితుడైన అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మోతీలాల్‌గౌడ్ అరెస్టులో సహకరించిన జిల్లా పోలీసు అధికారులను, సిబ్బందిని ఒడిశా పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు అందజేసి సన్మానించారు. తప్పించుకుని తిరుగుతున్న మోతీలాల్ గౌడ్ విజయనగరం జిల్లాలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఇటీవల ఒడిశా ఆర్థిక నేరనిరోధక విభాగం ఐజి అరుణ్ బోత్రా నాయకత్వంలో పోలీసు బృందం విజయనగరానికి వచ్చింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిసిఎస్ డిఎస్పీ చక్రవర్తి ఆధ్వర్యంలో డెంకాడ పోలీసులు, సిసిఎస్ పోలీసులు ఒక బృందంగా ఏర్పడి ఒడిశా పోలీసు ఉన్నతాధికారులతో కలసి నిందితుడు మోతీలాల్‌గౌడ్‌ను పట్టుకున్నారు. మంగళవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విజయనగరం సిసిఎస్ డిఎస్పీ చక్రవర్తి, డెంకాడ ఎస్సై ధనుంజయరావు, ఐదవ బెటాలియన్ రిజర్వు ఎస్సై మోహనరావు, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, ఆరి, అచ్చిరాజు, ఐటి కోర్ టీమ్ కానిస్టేబుల్ రవికుమార్, డెంకాడ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాసరావులను ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఒడిశా డిజిపి బి.కె.సింగ్, నేరవిభాగం స్పెషల్ డిజిపి బి.కె.శర్మ, ఐజి అరుణ్‌బోత్రా పాల్గొన్నారు.

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం
* స్వచ్ఛ ఎపి చీఫ్ ఆపరేటింగ్ అధికారి సురేష్
విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 30: మున్సిపాలిటీల పరిధిలో వ్యక్తిగత నిర్మాణాలను వేగవంతం చేయాలని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి సురేష్ ఆదేశించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మున్సిపల్, నగర పంచాయతీ కమిషనర్లు, ఇంజనీర్లు, మెప్మా అధికారులు, సమ్‌లెవెల్ రిసోర్స్‌పర్సన్లతో మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం మందకొడిగా జరుగుతోందన్నారు. అక్టోబర్ 2వ తేదీన నాటికీ బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నందున వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు, ఇతర అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ పి.ఆనందరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినందున మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని తెలిపారు. మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ ఆశాజ్యోతి మాట్లాడుతూ విజయనగరం మున్సిపాలిటీలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు మందకొడిగా జరుగుతున్నాయని తెలిపారు. అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదని చెప్పారు. అందువల్ల మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, విజయనగరం మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు పాల్గొన్నారు.

పురపాలక సంఘ పాఠశాలలో
ప్రొజెక్టర్ ద్వారా విద్యాబోధనకు శ్రీకారం

బొబ్బిలి, ఆగస్టు30: పట్టణ పరిధిలోని పురపాలక సంఘం పొట్టిశ్రీరాములు పాఠశాలలో ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుందని పురపాలక సంఘం చైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి అన్నారు. ఈ పాఠశాలలో ప్రొజెక్టర్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు అన్నిరంగాల్లోనూ అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఐఐటి ఫౌండేషన్ కోర్సులో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆధునిక పద్ధతుల ద్వారా విద్యాబోధన చేస్తున్నామన్నారు. ప్రొజెక్టర్ ద్వారా పాఠ్యాంశాలను నేరుగా విద్యార్థులకు అందించడం ద్వారా సులభంగా అర్ధం అవుతుందన్నారు. ఇదే తరహాలో మిగిలిన పాఠశాలలో ఏర్పాటుకు కృషి చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చోడిగంజి రమేష్‌నాయుడు, శంకరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు పాల్గొన్నారు.