విజయనగరం

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 30: జిల్లాలోని గిరిజన, మైదాన ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గృహనిర్మాణం, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి డాక్టర్ మృణాళిని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి మలేరియా వ్యాధి నియంత్రణపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని తెలిపారు. మంగళవారం ఆనందగజపతి ఆటోరియంలో వైద్యఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, బిసి, ఎస్టీ, ఎస్సీ సంక్షేమశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మృణాళిని మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ, డయేరియా సీజనల్ వ్యాధుల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాధుల బారిన పడిన ప్రజలకు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య పరీక్షల ద్వారా సేవలు అందించాలన్నారు. గర్భిణులకు ప్రధానమంత్రి సురక్షణ మాతృయోజన కింద ప్రతినెల 9వ తేదీన ప్రత్యేక పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. మాతాశిశు మరణాలను నియంత్రించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యం విషయంలో వార్డెన్లు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని, హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు అనారోగ్యం పాలైనప్పుడు వారిని ఇళ్లకు పంపించకుండా హాస్టళ్లలోనే ఉంచి పూర్తిస్థాయి వైద్యం చేయించాలని తెలిపారు. వారానికి ఒకసారి హాస్టల్ విద్యార్థులకు వైద్యపరీక్షలు జరపాలని డాక్టర్లను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజాప్రతినిధుల సహకారంతో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచేందుకు గ్రామస్థాయి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలలోని మంచినీటి ట్యాంకులను పదిహేను రోజులకు ఒకసారి శుభ్రం చేయడంతోపాటు క్లోరినేషన్ జరపాలని చెప్పారు.
జనరిక్ మందులు కొనుగోలు చేసేలా డాక్టర్లు ప్రజలను చైతన్యపరచాలన్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల నిర్వహణలో విజయనగరం జిల్లాకు రాష్టస్థ్రాయిలో మొదటిస్థానం లభించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను, వైద్యులను, సిబ్బందిని అభినందించారు. కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ ఆరోగ్యం, పారిశుద్ధ్య పరిరక్షణ విషయంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, బాగా పనిచేసే వారికి అవార్డులు ఇస్తామని తెలిపారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్సీ సంధ్యారాణి, ఎమ్మెల్యేలు మీసాల గీత, కె.ఎ.నాయుడు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శారద, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ ఉషశ్రీ, జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణరాజు, జెడ్పీ వైస్‌చైర్మన్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.