విజయనగరం

సమస్యలపై స్పందించకపోతే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 19: గ్రామాల్లో ప్రజా సమస్యలపై స్పందించని సిబ్బందిపై చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ నుండి ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. బాడంగి మండలం గొల్లాది ఎస్సీకాలనీలో నెలకొన్న అపారిశుద్ధ్యంపై కార్యదర్శి స్పందించడం లేదని, సర్ట్ఫికెట్ల విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని వార్డు మెంబర్ ఫిర్యాదుపై స్పందించిన జెసి ఎంపిడిఓపై విచారించి తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారికి అదేశించారు. ఎల్.కోట మండలం గోల్డ్ స్టార్ జంక్షన్ రేషన్ డీలర్ సరకులు సక్రమంగా ఇవ్వడం లేదన్న ఫిర్యాదుతో ఆ డీలరుపై చర్యలు తీసుకోవాలని జెసి డిఎస్‌ఓకి ఆదేశించారు. మక్కువ మండల ఎంపిడిఓ ఉపాధి హామీ, అభివృద్ధిపథకాల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని అందిన ఫిర్యాదుపై విచారించి వెంటనే చర్యలు తీసుకోవాలని, అటువంటి అధికారులను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఎస్.కోట మండలం బొద్దాంలో చెరువులోని తుమ్మచెట్లు అక్రమంగా నరికి వేశారని, వీటిపై అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదని వచ్చిన ఫోన్ కాల్‌పై తుమ్ముచెట్లు నరికిన నిధులు ఎందుకు జమ చేయలేదో విచారించి చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారికి అదేశించారు. వేపాడ మండలం బొద్దాంలో గతంలో నిర్మించిన మరుగుదొడ్లకు ఇప్పుడు బిల్లులు స్వచ్ఛ్భారత్ కింద చెల్లిస్తున్నారని వచ్చిన ఫిర్యాదుపై విచారించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇ-పాస్ పుస్తకాలద్వారా రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని, పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్ డీడ్‌లు అవసరం లేదని కొత్తవలస రైతు అడిగిన ప్రశ్నకు జెసి సమాధానం ఇవ్వడమే కాకుండా ఆమేరకు కొత్తవలస ఎస్‌బిఐ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఎల్‌డిఎం గురవయ్యకు సూచించారు. ఈకార్యక్రమంలో ఎజెసి నాగేశ్వరరావు, డిఆర్వో జితేంద్ర అధికారులు పాల్గొన్నారు.