విజయనగరం

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 23: పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించామని ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. రోడ్లపై పేరుకుపోయిన చెత్తాచెదారం, కాలువలో నిలిచిపోయిన వ్యర్థాలు, పూడికను తొలగించేందుకు వారంరోజుల పాటు స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పట్టణంలో చెత్తాచెదారం, కాలువల్లో పూడిక పేరుకుపోవడం వల్ల పలురకాల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున సామూహికంగా పూడికతీత పనులు చేపడతామని చెప్పారు. అదేవిధంగా పందుల నియంత్రణకు కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో సామూహికంగా పూడికతీత పనులు చేపట్టాలని నిర్ణయించామన్నారు. అన్ని వార్డులలోనూ ఈ ప్రక్రియను చేపడతామని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ కనకల మురళీమోహనరావు, మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు, పర్యావరణ ఇంజనీర్ బిహెచ్.సంతోషి కుమారి పాల్గొన్నారు.