విజయనగరం

సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ కార్మికుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 23: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో స్థానిక డిపో ఎదుట ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంప్లారుూస్ యూనియన్ డిపో కమిటీ కార్యదర్శి బిఆర్‌కె పరమహంస మాట్లాడుతూ డిపోలో శ్లాక్ సీజన్ పేరిట షెడ్యూళ్లను తగ్గించరాదన్నారు. ఎటువంటి బదిలీలు, రిలీవింగ్‌లు చేయరాదని తెలిపారు. కండక్టర్లు, డ్రైవర్ల డ్యూటీ చార్టులు వేయాలని జాయింట్ మీటింగ్‌లో నిర్ణయించినప్పటికీ, డ్యూటీలు వేయకపోవడం వల్ల అనేకమంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మూడేళ్ల నుంచి ఎడిసిల సప్లింగ్ జరగక పోవడంతో వారు కూడా నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ రీజనల్ కార్యదర్శి టిఎస్‌ఎన్‌రాజు, డిపో కోశాధికారి కెవి రమణ, ప్రచార కార్యదర్శులు పిఆర్ కుమార్, కె.సూరిబాబు పాల్గొన్నారు.