విజయనగరం

విద్యుత్ షాక్‌తో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్),సెప్టెంబర్ 23: విద్యుత్ ప్రమాదాల కారణంగా జిల్లాలో ముగ్గురు వ్యక్తులు మృతి చెంది ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపారు. విజయనగరం మండలం గుంకలాం గ్రామానికి చెందిన సిరిపురపు శంకర్(22), సువ్వాడశ్రీను(16) వినాయక చవితి నిమజ్జనం వేడుకలను ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి మృత్యువాత పడ్డారు. ఎస్.కోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన కిరాణా వ్యాపారి టిత్రినాథ(63) రోజూలాగే వారపుసంతకు అరకు వెళుతూ ఎస్.కోట పట్టణంలోని దేవీ బొమ్మ కూడలిలోని దుర్గాదేవికి నమస్కరించుకుని హుండీలో డబ్బులు వేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. ఈ ఘటనల్లో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.
గుంకలాంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించిన యువత గురువారం రాత్రి గణపయ్యను గ్రామ సమీపంలోని చెరువులో నిమజ్జనం ఇద్దరు యువకులు ట్రాక్టరులో తిరిగి ఇంటికి వస్తున్నారు. ట్రాక్టరు ట్రాలీలో ఉన్న ఇద్దరు కింద పడిపోకుండా ఉండేందుకు ట్రాలీకి అమర్చిన కర్రలు పట్టుకుని ఉన్నారు. అదే సమయంలో వారు ప్రయాణిస్తున్న ట్రాక్టరు గ్రామంలోకి చేరుకుంటుండగా వర్షం కురుస్తోంది. ఇళ్లకు కరెంటు సరఫరా చేసే విద్యుత్ వైర్లకు ట్రాలీకి తగలడంతో విద్యుత్ ప్రవహించి ఇద్దరు కరెంటు షాక్‌కు గురై మృత్యవాత పడ్డారు. మృతుల్లో సిరిపురపుశంకర్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఇటీవలే విజయనగరం మండల కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగంలో చేరి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈనేపథ్యంలో అతడు మృతి చెందడంతో అతని కుటుంబం కన్నీరుమున్నీరు అయింది. సువ్వాడశ్రీను ఇంటర్ చదువుతున్నాడని, కూలీ పనిచేసుకుంటూ అతని తండ్రి రమణ చదివిస్తున్నాడని గ్రామస్థులు తెలిపారు. మృతదేహాలకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కిరాణా వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న ధర్మవరం వాసి త్రినాథ ప్రతి శుక్రవారం అరకులో జరిగే వారపుసంతకు వెళ్లి వ్యాపారం సాగిస్తాడు. అక్కడికి వెళ్లే ముందు ఎస్.కోట దేవి కూడలిలోని దుర్గామాతను దర్శించుకుని వెళ్లడం అతనికి అలవాటు. అదేరీతిలో అమ్మవారికి నమస్కారం చేసుకుని హుండీలో డబ్బులు వేస్తూ కరెంటు షాక్‌కు గురై మృతి చెందడం ఈప్రాంతంలో సంచలనం కలిగించింది. ఎస్.కోట పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.