విజయనగరం

ఆదాయంలో మిన్న...అభివృద్ధిలో సున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 25: పట్టణంలో శివారు ప్రాంతాల్లో సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పన్నుల రూపంలో మున్సిపాలిటీకి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించడం లేదని, మున్సిపల్ పాలకవర్గసభ్యులు కూడా పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజల వాపోతున్నారు. మున్సిపాలిటీలో ఆస్తిపన్ను, భవన నిర్మాణాల వచ్చే ఆదాయం, ఖాళీ స్థలాలపై పన్ను విధింపుతదితర వాటిద్వారా ప్రతీయేటా 25 కోట్ల రూపాయల మేరకు ఆదాయం వస్తోంది. ఇవి కాకుండా పలు గ్రాంట్ల ద్వారా కోట్లాది రూపాయల నిధులు వస్తున్నాయి. అభివృద్ధి పనులు మాత్రం జరగడంలేదు. సరైన రోడ్లు, కాలువలు లేకపోవడం వల్ల పట్టణ ప్రజలు నరకయాతనలు పడుతున్నారు. గత కొన్నిరోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పట్టణం నడిబొడ్డులో ఉన్న రహదారులతోపాటు శివారు కాలనీల్లో ఉన్న రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. చాలాచోట్ల నడవడానికి కూడా వీలులేని విధంగా తయారయ్యాయి. మున్సిపాలిటీలో పన్నుల వసూలు, భవన నిర్మాణాలు, ఖాళీ స్థలాలపై పన్ను విధింపు వాటి ద్వారా వచ్చే ఆదాయంలో 43.44 కోట్ల రూపాయలు ఉన్నాయి. అలాగే 13వ ఆర్థిక సంఘం నిధులు 8.3 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నిధులు 9.5 కోట్లు, బిఆర్‌జిఎఫ్ నిధులు 3.6 కోట్లు, బిఎస్‌పి నిధులు 1.45 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో మూలుగుతున్నాయి. అదేవిధంగా నాన్‌ప్లాన్ గ్రాంటు కింద 9.74 కోట్లు ఉండగా, ఐడిఎస్‌ఎం షాపింగ్ కాంప్లెక్స్‌లో అద్దె రూపంలో వచ్చిన ఆదాయంలో 5.16 కోట్ల రూపాయలు ఉన్నాయి. వివిధ గ్రాంట్ల ద్వారా మున్సిపాలిటీకి దండిగా ఆదాయం వస్తున్నప్పటికీ, ఆశించిన మేరకు అభివృద్ధి జరగడం లేదు. పట్టణ శివారులో ఉన్న వైఎస్సార్ కాలనీలో కనీస సదుపాయాలు కూడా లేవు. అదేవిధంగా కెఎల్‌పురం శివారు కాలనీలలో కూడా అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఇదే దుస్థితిలో పూల్‌భాగ్, రాజీవ్‌నగర్, బిసి కాలనీ ఉన్నాయి. ఈ కాలనీల్లో రోడ్లతోపాటు డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రజలు తీరని అసౌకర్యానికి గురవుతున్నారు. మున్సిపాలిటీకి కోట్లాది రూపాయల ఆస్తిపన్ను చెల్లిస్తున్నా, వౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహించడం తగదని పట్టణ ప్రజలు వాపోతున్నారు. మున్సిపాలిటీలో నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ, అభివృద్ధి పనులు ఎందుకు చేయలేకపోతున్నారో అర్థం కావడం లేదని వారన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ పాలకులు, అధికారులు దృష్టి సారించి పట్టణంలో వౌలిక సదుపాయాలను కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

గిరిజన ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం
విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 25: గిరిజన ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోరాటం కొనసాగిస్తామని ఎపి గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు అడ్డూరి పైడితల్లి తెలిపారు. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ భవనంలో సంఘం ప్రథమ వార్షికోత్సవ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో, జిల్లాలో అన్ని కార్యాలయాల్లో ఎస్టీ సెల్ ప్రత్యేకంగా ఏర్పాటుచేయాలని కోరారు. ఏజెన్సీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మైదానప్రాంతాలకు బదిలీ అవకాశం కల్పించాలని, డిప్యూటీ డిఇఒ , డైట్ లెక్చరర్, ఎంఇఒ పోస్టులకు అడ్‌హాక్ రూల్స్ పాటించి నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో గిరిజన ఉపాధ్యాయులకు జరుగతున్న అన్యాయంపై పోరాటం చేస్తామని చెప్పారు. ఎంఇడికి జీవో-342 కింద అవకాశం కల్పించాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణనుండి ఉపాధ్యాలయులను తప్పించాలన్నారు. ఎయిడెడ్ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాలన్నారు. మున్సిపల్ ఉపాధ్యాలయులకు సర్వీసురూల్స్ రూపొందించాలని కోరారు. సంఘం బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగ సంఘ నాయకులు అలుగు వెంకటరావు మాట్లాడుతూ గిరిజన ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఉమ్మడి సమస్యలపై ఐక్యంగా పోరాడాలన్నారు. ఈకార్యక్రమంలో ఎపి గిరిజన ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి అమరనాధ్,గౌరవ అధ్యక్షుడు తవిటం దొర, ఆర్టీసీ గిరిజన ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కె లక్ష్మణరావు, విశాఖ గిరిజన ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు స్వామి, గిరిజన సంక్షేమ శాఖ ప్రధానకార్యదర్శి సీతారం ఉద్యోగులు పాల్గొన్నారు.