విజయనగరం

వంశధార కాలువలో ఇంజనీరింగ్ విద్యార్థి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జామి, అక్టోబర్ 6 : మండలంలోని జామి గ్రామానికి చెందిన ఒక ఇంజనీరింగ్ విద్యార్థి వంశధార నది ప్రధాన కాలువలో పడి గల్లంతైన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. జామి గ్రామానికి చెందిన రంబ అశోక్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ బిటెక్ మెకానికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇతని స్నేహితుడు అనంత ప్రసాదరెడ్డి గ్రామ పండగ సందర్భంగా సొంతఊరు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కొత్తపేటకి తీసుకుకెళ్లాడు. ఈ ఇద్దరు స్నేహితులు కలిసి వంశధార మెయిన్ చానల్‌కు చెందిన కా లువ కృష్ణాపురం రేవు వద్ద స్నానానికి వెళ్లారు. స్నానానికి దిగిన వీరిలో అశోక్ కాలువ నీటి ఉధృతికి గల్లంతయ్యాడు. చుట్టుపక్కల వారిని పిలిచి అశోక్ కోసం వెతికించినా ఫలితం లేకపోవడంతో మృతుని తల్లిదండ్రులు అప్పారావు, ఎర్రయ్యమ్మలకు స్నేహితుడు సమాచారం అందించాడు. పండగకి స్నేహితుడితో కలసి వెళ్లిన కుమారుడు ప్రమాదంలో విగత జీవుడవుతాడని ఊహించ లేకపోయామని, అన్నిజాగ్రత్తలు చెప్పామని వాపోయారు. బుధవారం రాత్రంతా కుమారుడి కోసం ఆందోళన చెందిన తల్లిదండ్రులకు గురువారం ఉదయం మృతి చెందాడనే వార్త తెలియడంలో శోకసంద్రంలో మునిగిపోయారు. గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో కాలువలో వెతికించి విద్యార్థి మృతదేహాన్ని వెలికితీశారు. కుమారుడు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

మరుగుదొడ్ల బిల్లులకు రూ.1.42 కోట్లు మంజూరు
విజయనగరం(టౌన్), అక్టోబర్ 6: జిల్లాలో నాన్ ఓడిఎఫ్ గ్రామాలలో నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లు లబ్దిదారులకు చెల్లించేందుకు ప్రభుత్వం 1.42 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని గురువారం తెలిపారు. జిల్లాలో 192 నాన్ ఓడిఎఫ్ గ్రామాలలో పూర్తయిన 2052 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలకు సంబంధించి బిల్లులు చెల్లించేందుకు నిధులు విడుదల చేశామని చెప్పారు. ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలనే ఆశయంతో 25 మండలాల్లో 192 గ్రామ పంచాయతీలలో నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇప్పుడు నిధులు మంజూరు కావడంతో త్వరితగతిన బిల్లులు చెల్పింపు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. బాడంగిలో 56, బలిజిపేటలో 8, బొబ్బిలిలో47, బొండపల్లిలో 7, దత్తిరాజేరులో 15, డెంకాడలో ఒకటి, గంట్యాడలో 18, గరుగుబిల్లిలో 11, గుమ్మలక్ష్మీపురంలో 30, గుర్లలో9, జామిలో16, కొమరాడలో 32, కొత్తవలస 207, కురుపాం 89, లక్కవరపుకోట 183, మక్కువ 173, నెల్లిమర్ల 5, పాచిపెంట 78, పార్వతీపురంలో392, రామభద్రపురంలో 164, సాలూరులో 41, సీతానగరంలో 67, శృంగవరపుకోట 85, తెర్లాంలో 188, వేపాడలో 130 మొత్తం 2052 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలకు బిల్లులు చెల్లించడానికి చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.